బేబీ పింక్ లెహంగాలో ఆకట్టుకుంటున్న బేబమ్మ.. లుక్స్ అదుర్స్!
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తూ తమ అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు.
By: Madhu Reddy | 12 March 2026 1:00 AM ISTప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తూ తమ అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే.. మరొకవైపు అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువలో ఉండడానికి గ్లామర్ వలకబోస్తూ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తూ మరీ.. వాటిని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన కృతి శెట్టి.. తెలుగులో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా తొలి ప్రయత్నంలో చేసిన 'ఉప్పెన' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో తన పాత్రలో లీనం అయిపోయి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించారు. పైగా దర్శకుడికి, ఈ నటీనటులు ఇద్దరికీ కూడా ఈ సినిమా మొదటి సినిమా కావడం గమనార్హం . మొదటి సినిమానే అయినా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. వంద కోట్ల క్లబ్లో చేరి మెప్పించారు. పైగా ఈ చిత్రానికి బోలెడు అవార్డులు కూడా లభించాయి.
ఈ సినిమా ఇచ్చిన ఫలితం ఈమెకు వరుసగా అవకాశాలు అందించింది. అలా నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య, నాగార్జున కలయికలో వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ , మనమే, అన్నగారు వస్తారు ఇలా పలు చిత్రాలు చేసింది. కానీ ఏవి కూడా మంచి విజయాన్ని అందించలేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్లో బిజీ అయిపోయిన ఈమె.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి మీడియాలో బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా బేబీ పింక్ కలర్ లో లెహంగా ధరించి.. తన అందాలతో మెస్మరైజ్ చేసింది. భిన్నమైన ఫోటోషూట్ తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం పింక్ కలర్ లెహంగాలో తన మేని ఛాయను మిళితం చేస్తూ .. షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కృతి శెట్టి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..ప్రదీప్ రంగనాథన్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటించిన ఈమె.. జయంరవి ప్రధాన పాత్రలో నటిస్తున్న జీనీ అనే భారీ బడ్జెట్లో భాగమైంది. అలాగే టోవినో థామస్ సరసన మలయాళ చిత్రం ఏ ఆర్ ఎం లో కూడా నటిస్తోంది. అంతేకాదు మరికొన్ని తమిళ , తెలుగు చిత్రాలు లైన్లో పెట్టినట్లు సమాచారం.
