ఆ అవకాశం అనుకోకుండా వచ్చింది
సినీ ఇండస్ట్రీలో కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అసలు ఎవరూ ఊహించని విధంగా కొందరు స్టార్లు అవడం, ఓవర్ నైట్ లో క్రేజ్ ఏర్పడటం జరుగుతుంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 29 Nov 2025 9:00 PM ISTఎవరి లైఫ్ ఏ క్షణాన ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. జీవితంలో తర్వాత ఫలానా జరుగుతుందని ముందే ఊహించలేం. అందుకే జీవితమంటే ఊహాతీతం అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అసలు ఎవరూ ఊహించని విధంగా కొందరు స్టార్లు అవడం, ఓవర్ నైట్ లో క్రేజ్ ఏర్పడటం జరుగుతుంటాయి.
డిసెంబర్ లో కీర్తి నుంచి రెండు సినిమాలు
అలా ఇండస్ట్రీలోకి ఇప్పటికే ఎంతోమంది తమ లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా, రెండోది నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ హీరగా తెరకెక్కిన అన్నగారు వస్తున్నారు. ఈ రెండు సినిమాలూ డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఉప్పెన ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
ఇక అసలు విషయానికొస్తే కృతి శెట్టి తన తాజా సినిమా LIK ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజవగా, వాటికి ఆడియన్స్ నుంచి అంతంతమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో కృతి తనకు ఉప్పెన సినిమాలో అవకాశమెలా వచ్చిందో వెల్లడించారు. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసం వెళ్లిన తనకు అనుకోకుండా ఆ ఛాన్స్ వచ్చిందని కృతి పేర్కొన్నారు.
ఒక రోజు ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ ఆడిషన్ కోసం వెళ్లిన తనను అది పూర్తయ్యాక పికప్ చేసుకుంటానని తన తండ్రి చెప్పారని, తన ఆడిషన్ పూర్తై తండ్రి ఎంతకీ రాకపోవడంతో పక్కనే ఉన్న స్టూడియోలోకి వెళ్లానని, అక్కడో మరో ఆడిషన్ జరుగుతుందని, అక్కడ తనను చూసి మూవీస్ పై ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే ఏం చెప్పాలో తెలియక తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చానని, ఆ తర్వాత టీమ్ తన తల్లికి కాల్ చేసి ఉప్పెనలో ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సినిమా తర్వాత కృతికి ఎలాంటి స్టార్‌డమ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉప్పెన సినిమా కృతిని ఓవర్ నైట్ స్టార్ ను చేసినప్పటికీ దాన్ని అమ్మడు కంటిన్యూ చేయలేకపోయింది.
