Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ తో కృష్ణ చైతన్య.. ఆ 'పవర్' ఫుల్ స్టోరీతోనే..

అయితే పవర్ పేట స్క్రిప్ట్ తో కృష్ణ చైతన్య.. సినిమాను మూడు పార్టుల్లో తీస్తారని టాక్ వినిపించినా.. ఇప్పుడు సింగిల్ పార్ట్ రూపంలో మాత్రమే తీస్తారని తెలుస్తోంది.

By:  M Prashanth   |   29 July 2025 11:45 AM IST
సందీప్ కిషన్ తో కృష్ణ చైతన్య.. ఆ పవర్ ఫుల్ స్టోరీతోనే..
X

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. పాటల రచయితగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మంచి సాంగ్స్ అందించారు. ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రౌడీ ఫెలో మూవీతో దర్శకుడిగా మారారు. ఆ చిత్రంతో తనదైన టాలెంట్ తో మెప్పించారు. నారా రోహిత్ హీరోగా నటించిన ఆ సినిమా.. అందరినీ ఆకట్టుకుంటోంది.

నాలుగేళ్ల గ్యాప్

కృష్ణ చైతన్య డైలాగ్స్ తో పాటు మూవీ తీసిన విధానం ఫిదా చేసింది. ఆ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ ఇచ్చిన ఆయన.. చల్ మోహన్ రంగా సినిమాను తెరకెక్కించారు. యంగ్ హీరో నితిన్, మేఘా ఆకాష్ లీడ్ రోల్స్ లో నటించారు. గత ఏడాది యంగ్ హీరో విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తీసిన కృష్ణ చైతన్య విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో అతని మేకింగ్ విధానానికి ఫుల్ మార్క్స్ పడ్డాయి.

ఒక కొత్త కోణంలో

గోదావరి ప్రాంతాన్ని ఒక కొత్త కోణంలో చూపించి మంచి కంటెంట్ ఉన్న దర్శకుడు అని నిరూపించుకున్నడు. త్రివిక్రమ్ కూడా యువ దర్శకుడి టాలెంట్ కు ఫిదా అయ్యారు. ఇక కృష్ణ చైతన్యతో సినిమా చేయాలని టాలీవుడ్ యువ హీరోలు గట్టిగానే ఫోకస్ చేశారు. ఇక అతని వద్ద పవర్ ఫుల్ స్క్రిప్ట్ పవర్ పేట్ ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా నితిన్ హీరోగా ప్రకటన జరిగింది. కానీ తరువాత కొన్ని కారణాల వాళ్ళ మూవీ ముందుకు వెళ్ళలేదు.

ఆ తర్వాత నితిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తారని టాక్ వచ్చింది. ప్రాజెక్ట్ ఓవరాల్ ఓకే అయిందని.. అనౌన్స్మెంట్ వస్తుందని గుసగుసలు వినిపించాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, సందీప్ కిషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. యాత్ర, ఆనందో బ్రహ్మ వంటి పలు సినిమాలు నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ రూపొందించనుందని సమాచారం.

పవర్ పేట స్క్రిప్ట్

అయితే పవర్ పేట స్క్రిప్ట్ తో కృష్ణ చైతన్య.. సినిమాను రెండు పార్టుల్లో తీస్తారని టాక్ వినిపించినా.. ఇప్పుడు సింగిల్ పార్ట్ రూపంలో మాత్రమే తీస్తారని తెలుస్తోంది. ఏలూరు బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రూపొందనుందని సమాచారం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో పవర్ పేట్ మూవీపై సందీప్ కిషన్, కృష్ణ చైతన్య.. ఇద్దరూ మంచి హోప్స్ పెట్టుకుంటారనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరికీ హిట్ కావాల్సి ఉంది. సందీప్ తన యాక్టింగ్ తో ఎప్పుడూ అదరగొడతారు. కృష్ణ చైతన్య తన టేకింగ్, మేకింగ్ తో ఆకట్టుకుంటారు. దానికి తోడు పవర్ పేట ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. మరి ఆ సినిమాతో ఇద్దరూ ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.