Begin typing your search above and press return to search.

స్వీటీతో సినిమా చేయ‌డానికి గ‌ల కార‌ణ‌మ‌దే!

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి త‌ర్వాత మ‌రో సినిమా చేసింది లేదు. ఆ సినిమా హిట్టైన‌ప్ప‌టికీ అనుష్క స్పీడుని మాత్రం పెంచ‌లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Sept 2025 11:00 AM IST
స్వీటీతో సినిమా చేయ‌డానికి గ‌ల కార‌ణ‌మ‌దే!
X

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి త‌ర్వాత మ‌రో సినిమా చేసింది లేదు. ఆ సినిమా హిట్టైన‌ప్ప‌టికీ అనుష్క స్పీడుని మాత్రం పెంచ‌లేదు. చాలా గ్యాప్ తీసుకున్న త‌ర్వాత డైరెక్ట‌ర్ క్రిష్ తో క‌లిసి ఘాటీ అనే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ చేశారు అనుష్క‌. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విక్ర‌మ్ ప్ర‌భు ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ప్ర‌మోష‌న్స్ లో క‌నిపించ‌ని స్వీటీ

సెప్టెంబ‌ర్ 5న ఘాటీ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. సినిమా షూటింగ్ ను పూర్తి చేయ‌డ‌మే త‌న వంతు అన్న‌ట్టు అనుష్క ఎక్క‌డా ప్ర‌మోష‌న్స్ లో క‌నిపించ‌డం లేదు. దీంతో ఘాటీ ప్ర‌మోష‌న్స్ భారం మొత్తం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పైనే ప‌డింది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క్రిష్ ఈ సినిమాకు అనుష్క‌నే ఎందుకు ఎంచుకున్నార‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు.

అనుష్క స్టార్‌డ‌మ్ అలాంటిది

ఈస్ట్ర‌న్ ఘాట్స్‌లో ఓ కొండ నీడ మ‌రో కొండ‌పై ప‌డే ప్రాంతంలో శీలావ‌తి అనే అరుదైన గంజాయి పండుతుంద‌ని, అదెంతో విలువైంద‌ని, అదే ప్రాంతంలో శీలావ‌తి అనే అరుదైన అమ్మాయి కూడా ఉంటుంద‌ని, ఒక అమ్మాయి యాంగిల్ నుంచి ఈ క‌థ‌ను చెప్తే అందులో ఉండే ఎమోష‌న్స్, డెప్త్ అన్నీ స‌రిగ్గా ఆడియ‌న్స్ కు రీచ్ అవుతాయ‌నిపించిందని, స్టార్ హీరోతో చేస్తే ఎంత‌టి హైప్ వ‌స్తుందో అనుష్క‌తో చేసినా అలాంటి హైపే వ‌స్తుంద‌నుకుని అనుష్క‌తో ఘాటీని చేసిన‌ట్టు పేర్కొన్నారు క్రిష్.

ఘాటీలో అనుష్క న‌ట విశ్వ‌రూపం చూస్తారు

దాంతో పాటూ ఎప్ప‌ట్నుంచో అనుష్క‌తో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని, అది ఇప్ప‌టికి ఘాటీ రూపంలో కుదిరింద‌ని క్రిష్ అన్నారు. ఘాటీలో అనుష్క‌ను ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా ఆమె న‌ట‌ విశ్వ‌రూపం చూస్తార‌ని, అది చూసి ఆడియ‌న్స్ పిచ్చోళ్ల‌వ‌డం ఖాయ‌మ‌ని, యాక్ష‌న్ సీన్స్ నుంచి ఎమోష‌న‌ల్ సీన్స్ వ‌ర‌కు ప్ర‌తీ సీన్ లో అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని క్రిష్ చెప్పారు. యువి క్రియేష‌న్స్, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై స్వీటీ ఫ్యాన్స్ కు మంచి అంచ‌నాలున్నాయి.