క్రిష్ నెక్స్ట్.. ఫోకస్ పెట్టాల్సిందెక్కడ?
టాలీవుడ్ లో విభిన్న కథలతో మెప్పించే దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి పేరు కచ్చితం టాప్ లో ఉంటుంది.
By: M Prashanth | 1 Jun 2026 1:20 PM ISTటాలీవుడ్ లో విభిన్న కథలతో మెప్పించే దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి పేరు కచ్చితం టాప్ లో ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కథల్లో మిక్స్ చేస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, వేదం, కంచె వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయన టాలెంట్ కు ఎగ్జాంపుల్ గా నిలిచాయి. అయితే గత కొంతకాలంగా క్రిష్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదని అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘాటీ సినిమాపై మొదట్లో బజ్ కనిపించినప్పటికీ.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ ను అందుకోలేకపోయింది. అనుష్క శెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఆ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదలకు ముందు వరుస వాయిదాలు, లిమిటెడ్ ప్రమోషన్స్, ప్రేక్షకుల్లో సరైన స్థాయిలో ఆసక్తి పెంచలేకపోవడం వంటి కారణాలు సినిమాపై ప్రభావం చూపినట్లు టాక్ వినిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో క్రిష్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తి నెలకొంది. అయితే ఆయన మళ్లీ తనకు బాగా తెలిసిన దారినే ఎంచుకున్నట్లు సమాచారం. భారీ క్యాస్టింగ్, స్టార్ హీరోలు, పెద్ద హడావుడికి దూరంగా కథకే ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. క్రిష్ ప్రస్తుతం సరికొత్త సర్వైవల్ డ్రామా స్టోరీ లైన్ తో సినిమా రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ లేకుండా, కొత్త నటీనటులతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. అంతే కాదు.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథకు నేచురాలిటీ ప్రధాన బలంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సాధారణంగా ఈరోజుల్లో సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అప్డేట్లతో హడావుడి కనిపిస్తుంది. కానీ క్రిష్ మాత్రం సెపరేట్ ప్లాన్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యాకే ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ ద్వారా ఒకేసారి ప్రాజెక్ట్ ను ప్రకటించాలని భావిస్తున్నారట. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కాన్సెప్టులను మాత్రమే కాకుండా స్ట్రాంగ్ స్టోరీ, ఆకట్టుకునే ప్రెజెంటేషన్ కోరుకుంటున్నారు.
సినిమా చుట్టూ ఎంత సీక్రసీ మెయింటైన్ చేసినా, చివరకు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్లేది కంటెంట్ మాత్రమే. గత కొన్నేళ్లుగా చిన్న సినిమాలు కూడా మంచి కథతో భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకే క్రిష్ విషయంలో ఇప్పుడు ప్రధాన చర్చ స్టోరీ, రైటింగ్, మేకింగ్ చుట్టూనే తిరుగుతోంది. ఆయన తన రైటింగ్ స్కిల్ ను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ ఎఫెక్ట్ చూపించే స్టోరీతో వస్తే ప్రేక్షకుల ఆదరణ దక్కే అవకాశం ఉంది. కొత్తవాళ్లతో సినిమా చేయడం డేరింగ్ డెసిషన్ అయినా, దానికి స్ట్రాంగ్ స్టోరీ తోడైతే రిజల్ట్ భిన్నంగా ఉండవచ్చు. ఏదేమైనా క్రిష్ ప్రస్తుతం సైలెంట్ గా పని చేస్తున్నా.. అసలు ఫోకస్ ప్రమోషన్స్ కంటే కంటెంట్ పైనే ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పుడు సర్వైవల్ డ్రామాతో ఆయన మరోసారి తన మార్క్ చూపించి సక్సెస్ ట్రాక్ లోకి తిరిగి వస్తారా లేదా అన్నది చూడాలి.
