కమర్శియాల్టీ కోసం క్రిష్ కసరత్తులా?
దీనిలో భాగంగా శంకర్, రాజమౌళి, సుకుమార్ చిత్రాలతో పాటు కొన్ని తమిళ సినిమాల్ని రిఫరెన్స్ గా తీసుకుని స్టడీ చేస్తున్నారుట.
By: Srikanth Kontham | 22 Feb 2026 8:30 AM ISTడైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఓ కాన్సెప్ట్ లా అతడి సినిమాలు సాగిపోతుంటాయి. కథని కమర్శియలైజ్డ్ చేయడంలో క్రిష్ వీక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడిగా అతడికి అంత గొప్ప పేరు తీసుకొచ్చింది అతడి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ లే అయినా? కమర్శియల్ గా వర్కౌట్ కాకపోతే ఏ సినిమాకైనా నష్టమే.`గమ్యం`, `వేదం`,` కృష్ణవందే జగద్గురం`, `కంచె`లాంటి సినిమాలు దర్శకుడిగా గొప్ప ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. కానీ ఈ సినిమాలేవి కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆయన కెరీర్ మొత్తంలో 13 సినిమాలు చేసారు.
వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా పై నాలుగే. మిగతా సినిమాలు ఆ మాత్రం ఐడెంటిటీని కూడా తీసుకురాలేదు. క్రిష్ డైరెక్టర్ గా బిజీ అవ్వకపోవడానికి కారణం కూడా అదేనన్నది ఇండస్ట్రీ వర్గాల్లో నిత్యం జరిగే చర్చ. దేవకట్ట కూడా మంచి రైటర్ కం డైరెక్టర్. కానీ అతడి సినిమాలు కమర్శియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడతను ఏం చేస్తు న్నాడు? అంటే ఖాళీగానే కనిపిస్తున్నారు. క్రిష్ కూడా ఆ కోవకే వస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. క్రిష్ స్టోరీని కమర్శియలైజ్ చేయడంలో కసరత్తులు మొదలు పెట్టినట్లు వినిపిస్తోంది.
దీనిలో భాగంగా శంకర్, రాజమౌళి, సుకుమార్ చిత్రాలతో పాటు కొన్ని తమిళ సినిమాల్ని రిఫరెన్స్ గా తీసుకుని స్టడీ చేస్తున్నారుట. తాను రాసిన కథను కమర్శియలైజ్ చేయడానికి కావాల్సిన ఇన్ పుట్స్ ఏంటి? ఎక్కడ ఎలాంటి లాజిక్ వాడాలి? కామన్ ఆడియన్ కు కనెక్ట్ చేయాలంటే పాటించాల్సిన టెక్నిక్స్ ఏంటి? వంటి వాటిపై సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే తన సినిమాలకు వచ్చిన రివ్యూలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారుట. ఇది మంచి ఆలోచనే. ఎంత గొప్ప కథ రాసాం అన్నది కాదు.
రాసిన కథను ఎంత గొప్పగా తీసాం అన్నది ముఖ్యం. ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియా అయినా కమర్శియల్ గా మలచడం అన్నది చిన్న టాస్క్ కాదు. ఎంతో అనుభవం ఉంటే తప్ప సాధ్యం కాదు. క్రిష్ కాస్త ఆలస్యంగా కమర్శియాల్టీ వైపు అడుగులు వేయడం శుభ సూచికం. భవిష్యత్ లో గత తప్పిదాల్ని పునరావృతం చేయకుండా ఉండే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. క్రిష్ గత సినిమా `ఘాటీ` భారీ అంచనాల మద్య రిలీజ్ అయి ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ క్రిష్ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
