మళ్లీ ఐదేళ్లకు ఆ డైరెక్టర్ వెలుగులోకి!
క్రాంతి మాధవ్ టాలీవుడ్ లో మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్. `ఓనమాలు`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` లాంటి క్లాసిక్స్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు వైఫల్యాలే.
By: Srikanth Kontham | 4 Oct 2025 12:06 PM ISTక్రాంతి మాధవ్ టాలీవుడ్ లో మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్. `ఓనమాలు`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` లాంటి క్లాసిక్స్ హిట్స్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు వైఫల్యాలే. `ఉంగరాల రాంబాబు` లాంటి సినిమాను క్రాంతి మాధవ్ నుంచి ఏమాత్రం ఊహించలేదు. అటుపై తెరకెక్కించిన `వరల్డ్ ఫేమస్ లవర్` తో కొత్తగా ప్రయత్నించినా? సక్సెస్ అవ్వలేదు. ఈ కథ కోసం ఏకంగా సీనియర్ నిర్మాత. కె.ఎస్ రామారావు రంగంలోకి దిగడం విశేషం. అప్పటికే చాలా కాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్న రామారావు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఎంతగానో నమ్మారు.
అతడి రిటైర్మెంట్ పై డిస్కషన్స్:
కానీ ఆ నమ్మకాలు..అంచనాలు దారి తప్పాయి. ఆ తర్వాత క్రాంతి మాధవ్ డైరెక్టర్ గా మరో సినిమా చేయలేదు. టాలీవుడ్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో క్రాంతి మాధవ్ ఏమైపోయాడు? అన్న చర్చ పరిశ్రమలో నడి చింది. కానీ కాలం అన్నింటిని మర్చిపోయేలా చేస్తుందన్నట్లు క్రాంతి మాధవ్ కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అన్న చర్చకు అంతే వేగంగా వచ్చింది. అయితే అనూహ్యాంగా మళ్లీ క్రాంతా మాధవ్ కొత్త సినిమాతో సర్ ప్రైజ్ చేసాడు. చైతన్య రావు హీరోగా ఓ చిత్రాన్ని దసరా సందర్భంగా లాంచ్ చేసాడు.
హీరోల కోసం డైరెక్టర్లు వెయిటింగ్:
ఇది కూడా తన మార్క్ లవ్ స్టోరీ. న్యూ ఏజ్ లవ్ స్టోరీ. అందమైన లోకేషన్లలో భారీ స్థాయిలో తీస్తున్నట్లు తెలిపారు. అయితే క్రాంతి మాధవ్ మళ్లీ ఇలా కంబ్యాక్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇండస్ట్రీలో వచ్చిన మార్పులకు సక్సెస్ అయిన దర్శకులకే హీరోలు దొరకడం లేదు. హీరోలంతా బిజీగా ఉండటంతో భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్లే క్యూలో ఉంటున్నారు. వాళ్ల టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేసుకోవాల్సి వస్తోంది. ఇక ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్ల వైపు అయితే హీరోలు చూసే పరిస్థితే లేదు. మీడియం రేంజ్ హీరో కూడా పాన్ ఇండియా కథలంటూ ఇండియన్ మార్కెట్ పైనే కన్నేస్తున్నాడు.
మళ్లీ అలాంటి తప్పిదాలు దొర్లకుండా?
డిఫరెంట్ కాన్సెప్ట్ లు కావాలంటూ ఎంత కాలమైనా ఎదురు చూస్తున్నారు తప్ప కమిట్ అవ్వడం లేదు. అలాంటి కాపంపిటీషన్ లోకి క్రాంతి మాధవ్ దిగాడు. మరి ఈసారి సెకెండ్ ఇన్నింగ్స్ ని ఎంత పకబడ్భందీగా ప్లాన్ చేసాడు? అన్నది తెలియాలి. టాలీవుడ్ లో లవ్ స్టోరీలు డీల్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. క్రాంతా మాధవ్ అలాంటి కథల్ని బాడీ డీల్ చేయగల దర్శకుడు. ఎమోషన్...సెన్సిబుల్ అంశాల్ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. దర్శకుడిగా అతడి సక్సస్ కి కారణం అదే. మధ్యలోనే దారి తప్పాడు. మరి ఈసారి అలాంటి తప్పిదాలు దొర్లకుండా? సక్సెస్ పుల్ గా కొనసాగాలని నెటి జనులు ఆశీస్తున్నారు.
