కింగ్డమ్, వార్-2 గాయాలకు మందు
కొన్ని నెలల ముందు వరకు టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకడిగా ఒకడిగా ఉండేవాడు నాగవంశీ.
By: Garuda Media | 3 Sept 2025 8:30 AM ISTకొన్ని నెలల ముందు వరకు టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకడిగా ఒకడిగా ఉండేవాడు నాగవంశీ. కానీ ఇటీవల ఆయన జాతకం తిరగబడింది. ‘మ్యాడ్ స్క్వేర్’ సహా పలు చిత్రాల నుంచి వచ్చిన లాభాలన్నింటినీ.. తన నిర్మాణంలో వచ్చిన ‘కింగ్డమ్’, డిస్ట్రిబ్యూట్ చేసిన ‘వార్-2’ చిత్రాలు మింగేయడమే కాక అదనంగా నష్టాలు తెచ్చిపెట్టాయి. రెండు వారాల వ్యవధిలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగలడంతో నాగవంశీ షేక్ అయిపోయాడు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కొంతమేర ‘వార్-2’ నష్టాలను భర్తీ చేస్తున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.. నాగవంశీ బ్యాలెన్స్ షీట్ అయితే ఆశాజనకంగా లేదన్నది వాస్తవం. అదే సమయంలో నాగవంశీ ప్రొడక్షన్ నుంచి రావాల్సిన ‘మాస్ జాతర’ వాయిదా పడడం మరో ప్రతికూలాంశం. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న సమయంలో నాగవంశీకి ఒక ఊరట లభించింది. అదే.. కొత్త లోక. ‘హలో’ భామ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన ‘లోక’ చిత్రాన్ని తెలుగులో నాగవంశీ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ రిలీజ్ చేసింది.
రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. కానీ మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తెలుగులోనూ రెండో రోజు నుంచి పుంజుకుంది. కలెక్షన్లు అంతకంతకూ పెరిగాయి. వీకెండ్లో ఇతర తెలుగు చిత్రాలను మించి ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్‌లోనూ సినిమా పర్వాలేదనిపిస్తోంది. తక్కువ రేటుకే హక్కులు తీసుకుని ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా సినిమాను రిలీజ్ చేసిన నాగవంశీ.. మంచి లాభాలే అందుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కింగ్డమ్, వార్-2 చేసిన గాయాల నుంచి ‘కొత్త లోక’ నాగవంశీకి కాస్త ఉపశమనం ఇస్తుంటుందనడంలో సందేహం లేదు.
