ఓటీటీలోకి కొత్తలోక..దుల్కర్ సల్మాన్ ఏమన్నారంటే?
సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలోకి వచ్చిన కొన్ని వారాలకు ఓటీటీలోకి రావడం సహజం.
By: Madhu Reddy | 22 Sept 2025 11:51 AM ISTసాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలోకి వచ్చిన కొన్ని వారాలకు ఓటీటీలోకి రావడం సహజం. అయితే అమీర్ ఖాన్ లాంటి హీరోలు తమ సినిమాలను ఓటీటీకి ఇవ్వకపోయినా దాదాపు చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. అందుకే థియేటర్లలో సినిమాలు మిస్ అయినవాళ్లు.. ఇలా ఖాళీ సమయాలలో ఇంట్లో కూర్చొని తమకు నచ్చిన సినిమాని కుటుంబంతో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలా థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు కూడా ఇలా ఓటీటీ లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల 'కొత్తలోక' అంటూ ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ చిత్రం ఏంటి అనే విషయానికి వస్తే.. కళ్యాణి ప్రియదర్శన్ తొలిసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లేడీ సూపర్ హీరో అనే కాన్సెప్ట్ తో ' లోక చాప్టర్ 1: చంద్ర' అంటూ మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేశారు. మొదటి షోతోనే భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది అంటూ వార్తలు రాగా.. దీనిపై ఈ చిత్ర నిర్మాత, ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.." థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా ఓటీటీలోకి రావడం సహజమే. కానీ కొత్తలోక త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మకండి. ఓటీటీలోకి వచ్చే ముందు కచ్చితంగా మీకు అధికారికంగా తెలియజేస్తాము" అంటూ దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఓటీటీలోకి త్వరలో అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు అని, అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి వార్తలను నమ్మకండి అంటూ దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. ఈయన మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో కొత్త లోకను ఓటీటీలో చూడలేము అని స్పష్టం అవుతుంది.
ఇకపోతే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. వరుసగా కలెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉండడం.. దీనికి తోడు మహిళా కేంద్రీకృత చిత్రం కావడంతో ఓటీటీ విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇలా వాయిదా వేయడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. దసరా హాలిడేస్ కారణంగా ఈ సినిమాను ఇంకొన్ని రోజులు థియేటర్లలోనే కొనసాగించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరొకవైపు ఈ సినిమా ఓటిటి హక్కులు ఇంకా అమ్ముడు పోలేదని, ఇది కూడా ఆలస్యానికి కారణం కావచ్చు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా హక్కులను ఏ ప్లాట్ఫామ్ కొనుగోలు చేసింది? ఎప్పుడు రాబోతోంది? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
కొత్తలోక సినిమా విషయానికి వస్తే.. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించారు. కానీ అనూహ్యంగా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఊచకోతకోస్తోంది. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.
సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ కి సూపర్ పవర్స్ ఉంటాయి. అయితే ఈ విషయం కొంతమందికే తెలుసు. కానీ ఒకానొక సమయంలో ఆమె బెంగళూరుకి వచ్చి, తన అతీంద్రియ శక్తులను దాచిపెట్టి ఒక సాధారణ అమ్మాయిలా బ్రతుకుతుంది. కేఫ్ లో పని చేస్తూ ఉండే ఈమె ఎదురింట్లో సన్నీ తన ఫ్రెండ్స్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. చంద్రను చూసి ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందుల అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా స్టోరీ.
