Begin typing your search above and press return to search.

కొత్త లోక.. ఇది మరో బ్లాస్ట్

ఈ క్రమంలో గతంలో రెండవ స్థానంలో ఉన్న మంజుమ్మెల్ బాయ్స్ ను అధిగమించింది. శనివారం అంటే చిత్రం విడుదలైన 17వ రోజు కొత్త లోక.. తుడరుం ఆల్ టైమ్ ఫైనల్ కలెక్షన్లు రూ. 232 కోట్లను దాటేసింది.

By:  M Prashanth   |   15 Sept 2025 9:13 AM IST
కొత్త లోక.. ఇది మరో బ్లాస్ట్
X

చిన్న సినిమాగా రిలీజై భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది మలయాళ సినిమా కొత్త లోక ఛాప్టర్ 1. ఓపెనింగ్ రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడో వీకెండ్ లో కూడా అదిరే కలెక్షన్ల దుమ్మురేపుతోంది. మూడో శనివారంలో సినిమాకు వచ్చిన భారీ వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. తాజా వివరాల ప్రకారం.. ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఈ క్రమంలో గతంలో రెండవ స్థానంలో ఉన్న మంజుమ్మెల్ బాయ్స్ ను అధిగమించింది. శనివారం అంటే చిత్రం విడుదలైన 17వ రోజు కొత్త లోక.. తుడరుం ఆల్ టైమ్ ఫైనల్ కలెక్షన్లు రూ. 232 కోట్లను దాటేసింది. ఇక ఆదివారం 18వ రోజు వరకు మంజుమ్మెల్ బాయ్స్ క్లోజింగ్ వసూళ్లు రూ. 241 కోట్లు కూడా అధిగమించింది. ఫలితంగా మలయాళ ఇండస్ట్రీలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోక అరుదైన ఘనత సాధించింది.

మొత్తానికి, రానున్న 4- 5 రోజుల్లోనే ఈ చిత్రం ఎంపురాన్ ఫైనల్ కలెక్షన్లైన రూ. 266 కోట్లను దాటే అవకాశముంది. దాంతో మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా లోక నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు లాంగ్ రన్ లో ఈ సినిమా రూ. 300 కోట్ల మార్క్‌ను కూడా చేరే అవకాశముంది.

ఇటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. ఇక్కడ కూడా కొత్త లోక సినిమాకు మంచి స్పందన వస్తోంది. మలయాళ సినిమాలను ఆధరించడంలో ముందుండే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సైతం తెగ నచ్చేసింది. తెలుగులో ఇప్పటివకు రూ.8 షేర్, రూ.15 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అందుకుంది.

కాగా, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫాంటసీ సినిమా రూపొందింది. ఇందులో హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ ఫీమేల్ సూపర్ హీరో పాత్రలో కనిపించింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం వేయ్‌ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందింది. ఈ సినిమాను మొత్తం 5 భాగాలుగా ప్లాన్ చేశారు. ఓ యూనివర్స్ లాగా కొత్త లోక రానుంది.