ప్రభాస్ తరువాత వరుణ్ దెయ్యం.. ఎందుకు సేఫ్ అంటే..
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన బడ్జెట్, బిజినెస్ లెక్కలు పూర్తిగా సేఫ్ జోన్ లోనే జరిగాయి.
By: M Prashanth | 4 Aug 2026 10:11 AM ISTహారర్ కామెడీ జానర్ అంటే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ డబుల్ రిస్క్ లాంటిదే. ఈ తరహా సినిమాలు ఆడియన్స్ కు కనెక్ట్ అయితే వచ్చే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే కంటెంట్ లో ఏమాత్రం తేడా కొట్టినా ఫలితాలు కూడా అంతే దారుణంగా ఉంటాయి. మేకింగ్ లో ఏమాత్రం పట్టు తప్పినా ఆడియన్స్ ఏమాత్రం క్షమించరు. ఈ జానర్ లో కేవలం హైప్ మాత్రమే సినిమాను కాపాడలేదని రీసెంట్ ట్రాక్ రికార్డ్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. రిలీజ్ కు ముందు క్రియేట్ అయిన వైబ్, అంచనాలు ఎక్కడికో వెళ్లినా థియేటర్లలో కంటెంట్ వర్కౌట్ కాకపోవడంతో రిజల్ట్ డిజాస్టర్ గా మారింది. స్టార్ హీరో ఉన్నా సరే కథ, కామెడీ సింక్ అవ్వకపోతే నష్టాలు తప్పవని ఆ సినిమా నిరూపించింది. సరిగ్గా ఇక్కడే వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' మేకర్స్ చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేసినట్లు కనిపిస్తోంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన బడ్జెట్, బిజినెస్ లెక్కలు పూర్తిగా సేఫ్ జోన్ లోనే జరిగాయి. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ, ఓవర్ బడ్జెట్లకు పోకుండా కంటెంట్ కు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టారు. దీనివల్ల రిలీజ్ కు ముందే టేబుల్ పై ఎవరికీ పెద్దగా రిస్క్ లేని వాతావరణం సెట్ అయింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 15 కోట్ల లోపు షేర్ రాబడితే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. వరుణ్ తన గత సినిమాలకు పెట్టుకున్న టార్గెట్స్ లో ఇది సగానికి కొంచెం ఎక్కువే అని చెప్పాలి. కాబట్టి థియేటర్లలో సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, వీకెండ్ కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మౌత్ టాక్ బాగుంటే మాస్ సెంటర్స్ లో కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వరుణ్ తేజ్ కు ఇప్పుడు కమర్షియల్ గా ఒక సాలిడ్ హిట్ పడటం చాలా అవసరం. కంటెంట్ పరంగా ఎప్పుడూ కొత్తదనం ట్రై చేసే ఈ మెగా హీరో సరైన సక్సెస్ చూసి చాలా కాలమే అవుతోంది. గతంలో కొన్ని ప్రయోగాలు చేసినా అవి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
అనంతపురం కియా ఫ్యాక్టరీ నేపథ్యం, కొరియన్ ఆత్మ లాంటి వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఒకవైపు సేఫ్ జోన్ బిజినెస్, మరోవైపు ఫన్ జనరేట్ చేసే క్రేజీ కాన్సెప్ట్ వరుణ్ కు బాగా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా కనకరాజు ఆడియన్స్ ను నవ్విస్తూ భయపెడితే మాత్రం వరుణ్ తేజ్ కోరుకున్న ఆ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కచ్చితంగా దక్కుతుంది.
