Begin typing your search above and press return to search.

కొరియన్ కనకరాజు.. క్రేజీ ఐడియా వర్కౌట్ అయితే..

వరుణ్ తేజ్ ఇందులో కనకరాజుగా కనిపించనుండగా, కథలో ఒక కొరియన్ దెయ్యం ప్రవేశించడం మెయిన్ ట్విస్ట్‌ గా చెప్పుకుంటున్నారు.

By:  M Prashanth   |   26 July 2026 11:05 AM IST
కొరియన్ కనకరాజు.. క్రేజీ ఐడియా వర్కౌట్ అయితే..
X

రాయలసీమలో ఓ మాస్ కుర్రాడు.. అతడి జీవితంలోకి అనుకోకుండా ఎంటరయ్యే కొరియన్ కనెక్షన్.. పైగా దెయ్యం, గ్యాంగ్‌ స్టర్లు, కొరియన్ భాష, కియా ఫ్యాక్టరీ బ్యాక్‌ డ్రాప్! వినడానికి కాస్త విచిత్రంగా, కొత్తగా అనిపించినా, ఇదే ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారిన కొరియన్ కనకరాజు సినిమా స్పెషాలిటీీ. దర్శకుడు మేర్లపాక గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన ఆ కథపై ఆడియన్స్ లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.

రీసెంట్ గా సినిమా గురించి మాట్లాడిన మేర్లపాక గాంధీ, ఆ కథకు ఇన్స్పిరేషన్ పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీ అని వెల్లడించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కొరియన్లు ఉండడం, వారి కల్చర్ లోకల్ లైఫ్ స్టైల్ తో కలిసిపోవడం తనకు కొత్తగా అనిపించిందని చెప్పారు. రాయలసీమ నేలపై కొరియన్ కల్చర్ కనిపించడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ను కలిగించిందని, అదే కథగా మారిందని వివరించారు.

ఇక బెంగళూరులో ఓ పెళ్లికి వెళ్లినప్పుడు పెనుకొండలో కొరియన్ ఫుడ్, సూపర్ మార్కెట్లు, వారి లైఫ్ స్టైల్ గురించి మరింత తెలుసుకున్నానని, అప్పుడే కొరియన్లకు కనకరాజుతో సంబంధం ఏమిటి? అనే ప్రశ్న తనలో మొదలైందని గాంధీ తెలిపారు. ఆ ప్రశ్నే ఇప్పుడు కొరియన్ కనకరాజు మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా కథ మొత్తం రాయలసీమ సంస్కృతి, కొరియన్ కల్చర్ మధ్య జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ ఇందులో కనకరాజుగా కనిపించనుండగా, కథలో ఒక కొరియన్ దెయ్యం ప్రవేశించడం మెయిన్ ట్విస్ట్‌ గా చెప్పుకుంటున్నారు. హారర్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తూ తెరకెక్కించిన ఆ సినిమా నార్మల్ కమర్షియల్ ఫార్మాట్‌ కు భిన్నంగా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజర్‌ లో వరుణ్ తేజ్ కొరియన్ పోలీస్ స్టేషన్‌లో కనిపించడం, కొరియన్ భాషలో డైలాగులు చెప్పడం, కటానా కత్తితో కనిపించడం వంటి సీన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చకు దారితీశాయి.

ముఖ్యంగా రాయలసీమ యాసలో మాట్లాడే కనకరాజు ఒక్కసారిగా కొరియన్ వరల్డ్ లోకి వెళ్లడం ఎలా జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఆ సినిమా విజయం వరుణ్ తేజ్ కెరీర్‌ కు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని క్లియర్ తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేకపోయిన వరుణ్‌ కు, కొత్త కాన్సెప్ట్‌ తో వస్తున్న ఆ మూవీ మంచి బ్రేక్ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా మూవీ ఐడియా క్రేజీగా ఉంది.. వర్కౌట్ అయితే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌ లో కొత్త కథలు వస్తున్నాయనే విమర్శలు ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు ఇలాంటి విభిన్న ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి రాయలసీమ మాస్‌ కు కొరియన్ టచ్ యాడ్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 7వ తేదీ వరకు అంతా వేచి చూడాల్సిందే.