ఒక లారీ మట్టికి కక్కుర్తి పడి కాలు విరగ్గొట్టింది ఎవరు: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు.
By: M Prashanth | 7 Aug 2026 11:32 AM ISTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. ఇందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల హోస్ట్ గా వ్యవహరించగా, వరుణ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ గాంధీ పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో నిహారిక, వరుణ్ తేజ్ మధ్య జరిగిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూ ప్రారంభంలోనే నిహారిక వరుణ్ తేజ్ పై ఒక సరదా సెటైర్ వేసింది. మీ వల్ల ఇంకో సినిమా కొంచెం పోస్ట్ పోన్ అయిందని లోపల ఏమైనా అనిపిస్తుందా మీకు అసలు అని ప్రశ్నించింది. ప్రొడక్షన్ పనులు చేసుకోవాల్సిన దాన్ని నేను, ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూలు చేస్తున్నాను అని చాలా ఫన్నీగా అంది. నిహారిక నిర్మిస్తున్న భారీ సినిమా ఆలస్యం కావడంతో, ఆమె ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సరదాగా సెటైరిక్ గా మాట్లాడింది.
నిహారిక వేసిన ఆ సెటైర్ కి వరుణ్ తేజ్ వెంటనే అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చి సీన్ ని రివర్స్ చేశాడు. ఒక లారీ మట్టికి కక్కుర్తి పడి నా కాలు విరగ్గొట్టింది ఎవరు అంటూ ఆయన నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు. భారీ సినిమా వాలీబాల్ ప్రాక్టీస్ లో భాగంగా లారీ మట్టికి సంబంధించిన సెట్ వర్క్ లో తన కాలు ఫ్రాక్చర్ అయిన విషయాన్ని వరుణ్ అలా గుర్తుచేసి నిహారికను ఆటపట్టించాడు. వరుణ్ ఆ రేంజ్ లో కౌంటర్ ఇవ్వడంతో పక్కనే ఉన్నవాళ్లు నవ్వడం స్టార్ట్ చేశారు.
వరుణ్ ఇచ్చిన రివర్స్ కౌంటర్ తో నిహారిక నవ్వు ఆపుకోలేకపోయింది. అవన్నీ ఇక్కడ మాట్లాడకు, అసలు ప్రొడ్యూసర్ ని తొక్కుతున్నారు ఇక్కడ అంటూ ఆమె సరదాగా ఫైర్ అయింది. అన్న, చెల్లెళ్ల మధ్య ఉన్న సరదా బాండింగ్ ఈ ఇంటర్వ్యూలో క్లియర్ గా కనిపిస్తోంది. ఈ వీడియో బిట్ చూసిన నెటిజన్లు కూడా వీళ్లిద్దరి పంచ్ డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోల్లో ఇద్దరి కాంబో భలే వర్కౌట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.
కొరియన్ కనకరాజు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ ఇలాంటి డిఫరెంట్ అండ్ ఫన్నీ ప్రమోషన్స్ ని బాగా హైలెట్ చేస్తున్నారు. రొటీన్ గా సినిమా గురించి మాత్రమే చెప్పకుండా, సరదా ముచ్చట్లతో పబ్లిసిటీ చేయడం వల్ల యూత్ కి త్వరగా కనెక్ట్ అవుతోంది. ఈ చిన్న వీడియో క్లిప్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లో షేర్ అవుతూ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది.
ఏదేమైనా ప్రొడ్యూసర్ గా నిహారిక పడుతున్న కష్టాలు, హీరోగా వరుణ్ తేజ్ వేసిన కౌంటర్లు ఇంటర్వ్యూకి మంచి హైలైట్ గా నిలిచాయి. ఓవర్ హైప్ లేకుండా చాలా లైవ్లీగా సాగిన ఈ చిట్ చాట్ కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ రోజున మంచి ప్రమోషన్ లాగా ఉపయోగపడింది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
