ఎన్టీఆర్‌పై ట్రోలింగ్.. ప్రిప్లాన్డ్‌గా చేశారా?
‘కొరియన్ కనకరాజు’ రిలీజ్‌కు వారం ముందు నుంచే ఎన్టీఆర్ క్లిప్ సోషల్ మీడియాలో తిరగడం, దాని మీద ట్రోలింగ్ జరగడాన్ని నందమూరి, టీడీపీ ఫ్యాన్స్ ప్రస్తావించి ఇదంతా కుట్రపూరితంగా చేసిందే అంటున్నారు.
By: Garuda Media | 8 Aug 2026 11:24 PM ISTఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం చుట్టూ ఒక వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచే డైలాగ్ పెట్టారంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్ నటించిన ఓ పాత సినిమాలోని ‘మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్‌గా ఉన్నాయే’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
దాన్నే కమెడియన్ సత్య ‘కొరియన్ కనకరాజు’లో ఇమిటేట్ చేశాడు. ఐతే సత్య ఇలా లెజెండరీ నటుల్ని అనుకరించడం కొత్తేమీ కాదు. ‘మత్తు వదలరా’లో కూడా అతను ఎన్టీఆర్ ‘సూపర్ మ్యాన్’ గెటప్ వేసి కామెడీ చేశాడు. కానీ అప్పుడు ఎవరూ అభ్యంతరపెట్టలేదు కానీ.. ఇప్పుడు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది గౌరవభావంతో చేసిన ఇమిటేషన్‌లా లేదని, కించపరిచేలా ఉందని, ఇది ప్రి ప్లాన్డ్‌గా చేసిందే అని అంటున్నారు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నందమూరి కుటుంబం మీద ఉన్న ద్వేషంతో వరుణ్ తేజ్, అతడి తండ్రి నాగబాబు ఇలా ప్లాన్ చేశారని ఆరోపిస్తున్న వాళ్లూ ఉన్నారు.
‘కొరియన్ కనకరాజు’ రిలీజ్‌కు వారం ముందు నుంచే ఎన్టీఆర్ క్లిప్ సోషల్ మీడియాలో తిరగడం, దాని మీద ట్రోలింగ్ జరగడాన్ని నందమూరి, టీడీపీ ఫ్యాన్స్ ప్రస్తావించి ఇదంతా కుట్రపూరితంగా చేసిందే అంటున్నారు. ఈ ఆరోపణలపై ‘కొరియన్ కనకరాజు’ ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను ఒక సోషల్ మీడియా మీమ్ చూసి సరదాగా ఉంది అనుకుని సినిమాలో ‘అమెచ్యూరిష్’ డైలాగ్ పెట్టానని.. గత నవంబరులోనే దీన్ని షూట్ చేశామని గాంధీ తెలిపాడు.
సత్య కూడా ఎప్పుడో దీనికి డబ్బింగ్ పూర్తి చేశాడన్నాడు. ఐతే ఈ మధ్య అనుకోకుండా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ క్లిప్ వైరల్ అవడం చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని.. అరే ఇది మన సినిమాలో ఉంది కదా అనుకున్నానని.. ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగిందని అతనన్నాడు. ప్రేక్షకులు సినిమాలో ఆ సన్నివేశాన్ని సరదాగానే తీసుకుంటున్నారని, బాగా ఎంజాయ్ చేస్తున్నారని గాంధీ అన్నాడు. తాము ప్రి ప్లాన్డ్‌గా చేయాలనుకుంటే ఇంకా పెద్ద సీన్ తీసేవాళ్లమని, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ క్లిప్ వైరల్ కావడం అనుకోకుండా జరిగిందే తప్ప అందులో తాము చేసిందేమీ లేదని అతను స్పష్టం చేశాడు.
