Begin typing your search above and press return to search.

కొరియన్ కనకరాజు.. గ్యాప్ ఇవ్వట్లేదుగా..

లేటెస్ట్ గా విడుదలైన ఈ ప్రమోషనల్ వీడియోలో, ఆగస్టు 7న రాబోతున్న సినిమాను ఎలా అనౌన్స్ చేయాలనే దానిపై ముగ్గురూ కలిసి చేసే కామెడీ చాలా నాచురల్‌గా ఉంది.

By:  M Prashanth   |   4 Aug 2026 1:36 PM IST
కొరియన్ కనకరాజు.. గ్యాప్ ఇవ్వట్లేదుగా..
X

హారర్ కామెడీ జానర్‌లో వస్తున్న 'కొరియన్ కనకరాజు' మూవీ టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా గ్యాప్ ఇవ్వడం లేదు. సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్టుగానే ప్రమోషనల్ వీడియోలను కూడా చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. రీసెంట్‌గా ఈ టీమ్ వదిలిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్, కమెడియన్ సత్య కలిసి చేసిన అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ గా విడుదలైన ఈ ప్రమోషనల్ వీడియోలో, ఆగస్టు 7న రాబోతున్న సినిమాను ఎలా అనౌన్స్ చేయాలనే దానిపై ముగ్గురూ కలిసి చేసే కామెడీ చాలా నాచురల్‌గా ఉంది. వరుణ్ తేజ్, రితికా, సత్య ముగ్గురూ విభిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో "కొరియన్ కనకరాజు ఆగస్టు 7న వస్తున్నాడు" అనే డైలాగ్‌ను చెప్పేందుకు పడిన పాట్లు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. యాంగ్రీ, సాడ్, డిస్‌గస్టింగ్, హ్యాపీ, ఫ్లర్టీ ఇలా రకరకాల ఎమోషన్స్‌తో వాళ్ళు ఈ డైలాగ్ చెబుతుంటే, చూసేవాళ్లకు మంచి ఫన్ జనరేట్ అయింది.

ముఖ్యంగా ఈ వీడియోలో కమెడియన్ సత్య తన మార్క్ టైమింగ్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. వరుణ్ తేజ్ ఫ్లర్టీ మూడ్‌లో అనౌన్స్‌మెంట్ ఇస్తే, "అలా చెప్తే ఎవరు వస్తారురా?" అని సెటైర్ వేయడం హైలెట్. ఆ వెంటనే సత్య కూడా ఫ్లర్టీగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తే, వరుణ్ దాన్ని చూసి నవ్వుకోవడం, ఇలా ఈ కాంబో మధ్య జరిగిన చిన్న చిన్న కౌంటర్లు వీడియోకు మంచి హ్యూమర్ టచ్ ఇచ్చాయి.

ప్రమోషన్స్‌లోనే ఈ రేంజ్ కామెడీ ఉంటే, సినిమాలో వరుణ్, సత్యల మధ్య ఉండే ట్రాక్ ఇంకెంత ఫన్ క్రియేట్ చేస్తుందో అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇక కంటెంట్ మీదే కాకుండా, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానంలో కూడా దర్శకుడు మేర్లపాక గాంధీ తన మార్క్ చూపిస్తున్నారు. పెద్దపెద్ద ఈవెంట్లు, హడావుడి లేకుండా, సింపుల్ అండ్ స్వీట్ వీడియోలతో సినిమా థీమ్‌ను జనాల్లోకి తీసుకెళ్లే ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతోంది.

హీరోయిన్ రితికా నాయక్ కూడా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ వీడియోలో ఆకట్టుకుంది. ఇక విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో, ఈ వీడియో సినిమాకు కరెక్ట్ టైమ్‌లో మంచి ప్రమోషనల్ బూస్ట్ ఇచ్చింది. ఆగస్టు 7న థియేటర్లలో ఈ 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకులను ఏ స్థాయిలో నవ్విస్తాడో, హారర్ ఎలిమెంట్స్‌తో ఎంతలా భయపెడతాడో వేచి చూడాలి.