Begin typing your search above and press return to search.

పెనుకొండ టూ కొరియా.. కనకరాజు డైరెక్టర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్!

ఈ సక్సెస్ జోష్ లో ఉన్న మూవీ డైరెక్టర్ గాంధీ, ప్రత్యేకంగా tupaki.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి, తన జర్నీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

By:  M Prashanth   |   11 Aug 2026 6:28 PM IST
పెనుకొండ టూ కొరియా.. కనకరాజు డైరెక్టర్ చెప్పిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్!
X

రీసెంట్ గా రిలీజైన 'కొరియన్ కనకరాజు' మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీస్, పిల్లలు ఈ సినిమా కామెడీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ జోష్ లో ఉన్న మూవీ డైరెక్టర్ గాంధీ, ప్రత్యేకంగా tupaki.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి, తన జర్నీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

అసలు ఈ కొరియన్ సెటప్ ఐడియా ఎలా పుట్టిందో ఆయన చెప్పారు. ఒకసారి బెంగళూరు వెళ్తున్నప్పుడు పెనుకొండ దగ్గర ఉన్న కియా ఫ్యాక్టరీ చూశారట. అక్కడ చాలామంది కొరియన్స్ ఉంటున్నారని, వాళ్లకంటూ ఒక సెపరేట్ కల్చర్ ఉందని తెలియడంతో ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆ కొరియన్ బ్యాక్ డ్రాప్ కి మన లోకల్ కుర్రాడికి లింక్ పెడితే ఎలా ఉంటుందనే పాయింట్ తోనే ఈ స్టోరీ డెవలప్ చేశారట.

వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని డైరెక్టర్ చెప్పారు. సత్య కామెడీ పక్కాగా వర్కౌట్ అవుతుందని వరుణ్ స్ట్రాంగ్ గా నమ్మారట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన రీ రికార్డింగ్ సినిమాకి బాగా హెల్ప్ అయిందన్నారు. సీరియస్ అండ్ కామెడీ సీన్స్ కి తగినట్లుగా ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కొరియాలో పదిహేను రోజులు, కజకిస్తాన్ లో మరో పదిహేను రోజులు ప్లాన్ చేసి తీశారు. కొరియాలో షూటింగ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పనే అయినా, ప్రొడ్యూసర్స్ సపోర్ట్ తో అనుకున్న టైమ్ లోనే కంప్లీట్ చేశామని చెప్పారు. ఆ కొరియన్ గ్యాంగ్ స్టర్ సెటప్ కి, మన పెనుకొండ స్లాంగ్ కి మధ్య ఉన్న వేరియేషన్ ని చాలా పక్కాగా హ్యాండిల్ చేశారు.

తన పర్సనల్ లైఫ్ గురించి కూడా డైరెక్టర్ ఒక ఫన్నీ మేటర్ షేర్ చేసుకున్నారు. పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఆయనకు చెగువేరా అని పేరు పెట్టారట. కానీ ఊర్లో వాళ్ళు ఆ పేరు పలకలేక ఇష్టం వచ్చినట్లు పిలవడంతో, చివరకు ఆయనే పేరును గాంధీగా మార్చేశారని చెప్పారు. డైరెక్టర్ గా తన కెరీర్ కు వాళ్ళ నాన్న సపోర్ట్ ఎంతో ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు.

సినిమాలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ల ఇమిటేషన్ సీన్స్ కేవలం ఆడియన్స్ ని నవ్వించడానికే తప్ప, ఎవరినీ తక్కువ చేసి చూపించడానికి కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్ గా కొరియన్ కనకరాజు కి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. నెక్స్ట్ పార్ట్ ని 'కెన్యన్ కనకరాజు' పేరుతో తెరకెక్కించబోతున్నట్లు సూపర్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ గాంధీ చెప్పిన మరిన్ని డీటెయిల్స్ కింద ఉన్న వీడియోలో చూసేయండి.