Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ పవర్ఫుల్ హిట్.. లెక్క ఎక్కడి వరకు వెళ్లిందంటే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాడు. లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

By:  M Prashanth   |   17 Aug 2026 3:25 PM IST
వరుణ్ తేజ్ పవర్ఫుల్ హిట్.. లెక్క ఎక్కడి వరకు వెళ్లిందంటే..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాడు. లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. పది రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. వరుణ్ మార్కెట్ కు తగ్గట్టుగా ఈ నంబర్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకరకంగా వరుణ్ కెరీర్ లో ఇదొక పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.





కలెక్షన్స్ రావడం ఒక ఎత్తు అయితే సినిమా కొన్నవాళ్లు సేఫ్ అవ్వడం ఇంకో ఎత్తు. ఈ విషయంలో కొరియన్ కనకరాజు టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా క్రాస్ చేసేసింది. ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాభాలు చూస్తున్నారు. సినిమా అంతా ప్రాఫిట్ జోన్ లోకి రావడంతో నిర్మాతలు కూడా మంచి ఊపు మీద ఉన్నారు.

మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ జనాలకు భలే కనెక్ట్ అయింది. వరుణ్ తేజ్ తన రెగ్యులర్ యాక్షన్ స్టైల్ కు భిన్నంగా చేసిన పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. దానికి తోడు కమెడియన్ సత్య తనదైన కామెడీ టైమింగ్ తో ఎట్రాక్ట్ చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి. కథలో హారర్ కంటే ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

ఫస్ట్ వీక్ లో వచ్చిన బజ్ తో ఆగిపోకుండా సెకండ్ వీక్ లో కూడా ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీ చూపిస్తోంది. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్ హాలిడేస్ కలెక్షన్స్ కు బాగా హెల్ప్ అయ్యాయి. సెలవుల అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ ఇంత వేగంగా 50 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కట్టడం వల్లే ఈ ఫీట్ సాధ్యమైంది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు కలిసి ఈ ప్రాజెక్ట్ ను చాలా గ్రాండ్ గా నిర్మించాయి. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రిలీజ్ తర్వాత కూడా సక్సెస్ టూర్లు, వరుస ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తూ సినిమాను జనాల్లోనే ఉంచారు. ఆ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా గట్టిగా కాపాడాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ నంబర్ మరింత పెరిగే ఛాన్స్ పక్కాగా ఉంది.