Begin typing your search above and press return to search.

తారక్ డైరెక్టర్ తో బాలయ్య.. మోక్షజ్ఞ కోసమేనా?

అందుకే డైరెక్టర్ శివ కూడా దేవర పార్ట్ 2 ను ఇప్పటికైతే పక్కనపెట్టి.. మరో హీరోతో సినిమా చేసేందుకు ఇంకో కథ సిద్ధం చేశారని తెలిసింది.

By:  M Prashanth   |   28 Sept 2025 4:00 PM IST
తారక్ డైరెక్టర్ తో బాలయ్య.. మోక్షజ్ఞ కోసమేనా?
X

ఒక డైరెక్టర్ కు ఫ్లాప్ పడితే తర్వాత సినిమా ఎలా? ఎవరితో చేయాలి అని సందేహంలో పడతారు. ఫలితంగా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేకపోతారు. కానీ, టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు కొరటాల శివ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆయన దర్శకత్వం వహించిన దేవర సినిమా గతేడాది మంచి విజయం అందుకున్నా.. దీని రెండో పార్ట్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.

దీనికి కారణం హీరో జూనియర్ ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడమే. అయితే నిన్నటికి దేవర పార్ట్ 1 రిలీజై.. ఏడాది పూర్తైన సందర్భంగా మేకర్స్ రెండో పార్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్ దేవర పార్ట్ 2 కు సిద్ధంగా ఉండండంటూ పోస్ట్ షేర్ చేశారు. అయినా ఇది అప్పుడే పట్టాలెక్కేలా లేదు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇంత బిజీ షెడ్యూల్ లో దేవర ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే డైరెక్టర్ శివ కూడా దేవర పార్ట్ 2 ను ఇప్పటికైతే పక్కనపెట్టి.. మరో హీరోతో సినిమా చేసేందుకు ఇంకో కథ సిద్ధం చేశారని తెలిసింది. అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో శివ ఒక చిత్రం తెరకెక్కిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తయ్యాయని టాక్.

అయితే గత రెండు రోజులుగా మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. శివ త్వరలోనే నందమూరి బాలకృష్ణతో కలిసి పని చేయవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. శివ రాసుకున్న స్క్రిప్ట్ గురించి బాలకృష్ణను కలిసి చర్చించాలని ఆసక్తిగా ఉన్నారట. అయితే ఈ ఇద్దరి సమావేశం కూడా త్వరలోనే జరగనుందని సమాచారం. ప్రస్తుతానికైతే బాలయ్యను కొరటాల శివ కలవలేదు.

అటు బాలకృష్ణ అఖండ 2 పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని, క్రిష్‌ తో సినిమాలు లైన్ లో పెట్టారు ఉన్నాయి. ఆయన ఈ రెండు ప్రాజెక్ట్ లతో రాబోయే సంవత్సరం పాటు బిజీగా ఉండనున్నారు. మరి కొరటాల శివ కథ రెడీ చేసింది బాలకృష్ణ కోసమా? లేదా అతని కుమారుడు మోక్షజ్ఞ కోసమా అనేది కొత్తగా వస్తున్న సందేహం. ఏదేమైనా త్వరలోనే శివ బాలయ్య మీటింగ్ ఉండనుంది. ఆ తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.