రెండు సినిమాలు.. డైరెక్టర్ ఫేట్ మార్చేశాయి..?
రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అతను ప్రభాస్ తో మిర్చితో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత మహేష్ తో శ్రీమంతుడు.
By: Ramesh Boddu | 22 Aug 2025 11:27 AM ISTసినిమా ఇండస్ట్రీలో హిట్టు వస్తే ఎంతో పుష్ చేస్తారో ఫ్లాప్ పడితే అంతే కిందకు లాగుతారు. ఇక్కడ హిట్టు కొడుతున్న వాళ్లకే ప్రశంసలు, అవకాశాలు. అప్పటిదాకా హిట్ కొట్టిన ఎవరైనా ఒక్క ఫ్లాప్ పడింది అంటే చాలు పక్కన పెట్టేస్తారు. ఛాన్స్ లు లేక కెరీర్ కాస్త టఫ్ అవుతుంది. ఐతే ఎంత స్టార్ క్రేజ్ ఉన్నా కూడా స్టార్ డైరెక్టర్స్ ఇది ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేయాల్సిందే. ప్రస్తుతం అలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు కొరటాల శివ.
మిర్చితో డైరెక్టర్ గా..
రైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అతను ప్రభాస్ తో మిర్చితో డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత మహేష్ తో శ్రీమంతుడు. భరత్ అనే నేను, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, దేవర 1, చిరంజీవితో ఆచార్య చేశాడు. ఆచార్య ముందు వరకు కొరటాల శివ రేంజ్ వేరు. ఆఫ్టర్ ఆచార్య అతని గ్రాఫ్ పడిపోయింది. చిరంజీవి మాత్రమే కాదు ఆ సినిమాలో రాం చరణ్ ఉన్నా కూడా సినిమాను కాపాడలేకపోయారు. చిరు, చరణ్ నటించిన సినిమాగా ఆచార్యపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా సినిమా మిస్ ఫైర్ అయ్యింది. మంచి కథకుడు అనే పేరు నుంచి కొరటాల శివ డౌన్ ఫాల్ అయ్యాడు.
ఆచార్య తర్వాత ఎన్టీఆర్ పిలిచి దేవర ఛాన్స్ ఇచ్చాడు. దేవర ఒక సినిమాగా చేస్తే బాగుండేది. కానీ క్యారెక్టర్ బాగా వస్తుండటం వల్ల రెండు భాగాలుగా ఫిక్స్ చేశారు. దేవర 1 లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. దేవర 1 రిజల్ట్ తో ఎన్టీఆర్ కూడా అంత సాటిస్ఫైడ్ గా లేదన్న విషయం తెలిసిందే ఇంకా దేవర 2 కూడా చేయాల్సి ఉంది. దేవర 1 కాదు దేవర 2 పూర్తిగా కొత్త కథతో అంచనాలను మించి ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట కొరటాల శివ.
ఐతే దేవర 2 కి కాస్త టైం పట్టేలా ఉంది. ఇది కాకుండా కొరటాల శివ నిర్మాతగా టర్న్ తీసుకుంటారని తెలుస్తుంది. యంగ్ హీరోతో కొరటాల శివ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఐతే ఆ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే కొరటాల శివ టీం నుంచి కన్ ఫర్మేషన్ వస్తుంది.
కొరటాల కంబ్యాక్ కోసం వెయిటింగ్.
రైటర్ గానే కాదు డైరెక్టర్ గా మంచి సినిమాలు తీశాడు కొరటాల శివ. ఆయన స్టోరీ టెల్లింగ్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఆయన మళ్లీ సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎన్ టీ ఆర్ దేవర 2 ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. ఇక కొరటాల శివ కూడా నెక్స్ట్ దూకుడు పెంచుతున్నాడని తెలుస్తుంది.
కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ కొరటాల శివ డబుల్ జోష్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంది. ఐతే కొరటాల శివ నెక్స్ట్ అనౌన్స్ మెంట్ వరకు కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఐతే ఈలోగా ఆయన మీద ఆయన సినిమాల మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు.
