ల్యాండ్ మార్క్ మూవీ కోసం చైతూ సూపర్ ప్లాన్
దీంతో కొరటాల తన స్టామినాను దేవర2 తో ప్రూవ్ చేసుకుంటారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అసలు దేవర2 ఉంటుందా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2025 3:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఒకరు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు మంచి మంచి బ్లాక్ బస్టర్లను అందించిన శివ, చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నారు. ఆచార్య రిజల్ట్ తో కొరటాలపై చాలా నెగిటివిటీ వచ్చింది. ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా మంచి హిట్ అయినప్పటికీ ఆ సక్సెస్ మొత్తం ఎన్టీఆర్ ఖాతాలోనే పడింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొరటాల షాక్
దీంతో కొరటాల తన స్టామినాను దేవర2 తో ప్రూవ్ చేసుకుంటారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అసలు దేవర2 ఉంటుందా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ దేవర2 ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, దేవర2 ఉంటుంది, ఉండి తీరుతుందని ఎన్టీఆర్ కూడా స్టేజ్ పై చెప్పడంతో దేవర2 అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. దేవర2 అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్ కు కొరటాల ఇప్పుడు షాకిచ్చారు.
ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ కోసం..
కొరటాల తన తర్వాతి సినిమాను అక్కినేని నాగ చైతన్యతో చేయనున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తండేల్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న చైతన్య ప్రస్తుతం తన 24వ సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన కెరీర్ మైల్ స్టోన్ ఫిల్మ్ అయిన NC25 కోసం చైతన్య పలు డైరెక్టర్లు చెప్పే కథలు వింటున్నారని వార్తలొచ్చాయి. అందులో భాగంగానే శివ నిర్వాణ, బోయపాటి శ్రీనుతో పాటూ మరికొందరి పేర్లు వినిపించగా ఇప్పుడు సడెన్ గా ఆ లిస్ట్ లో కొరటాల కూడా జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, రీసెంట్ గా కొరటాల శివ నాగ చైతన్యకు ఓ స్క్రిప్ట్ ను నెరేట్ చేశారని, దానికి చైతన్య నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. కొరటాల చెప్పిన మాస్ డ్రామా చేయడానికి చైతన్య ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని అంటున్నారు. ఇదే నిజమైతే చైతూ ల్యాండ్ మార్క్ మూవీకి మంచి కాంబినేషన్ రెడీ అయినట్టే అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
