Begin typing your search above and press return to search.

కొర‌టాల‌తో బాల‌య్య కు స‌రికొత్త ఇమేజ్!

టాలీవుడ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో దర్శకుడు కొరటాల శివ శైలి స్పెష‌లిస్ట్.

By:  Srikanth Kontham   |   28 May 2026 12:00 AM IST
కొర‌టాల‌తో బాల‌య్య కు స‌రికొత్త ఇమేజ్!
X

టాలీవుడ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో దర్శకుడు కొరటాల శివ శైలి స్పెష‌లిస్ట్. ఆయన కథల్లో హీరోలు ఫైట్లు, డ్యాన్సులకే పరిమితం కారు. సమాజానికి మంచి చేసే బాధ్యతా యుతమైన పాత్రల్లో కనిపిస్తారు. రొటీన్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోలను సైతం క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌లోకి మార్చడంలో ఎంతో ప్రోఫెష‌న‌ల్. ఆ ర‌కంగా హీరోల కెరీర్‌లోనే మైలురాళ్లుగా నిలిచే విజయాలను అందించిన ట్రాక్ రికార్డ్ కొరటాల సొంతం. ఇప్పటికే కొరటాలతో పనిచేసిన అగ్ర హీరోలందరికీ సరికొత్త ఇమేజ్ అందించిన‌ సంగతి తెలిసిందే.

`మిర్చి` సినిమాతో ప్రభాస్‌లోని వింటేజ్ గ్లామర్ అండ్ స్టైల్‌ను చూపించారు. అటుపై `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` చిత్రాలతో మహేష్ ను అత్యంత హుందాగా, పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు. అలాగే `జనతా గ్యారేజ్`, `దేవర` చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అండ్ క్లాస్ కోణాల్లో ప్రెజెంట్ చేసి మెప్పించారు. హీరోల బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేయడం కొరటాల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తో కొరటాల శివ తెర‌కెక్కిస్తోన్న సినిమా టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య వరుస మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు.

ఆయన క్యారెక్టరైజేషన్ అనగానే హై-వోల్టేజ్ డైలాగులు, భారీ ఫైట్లు గుర్తుకొస్తాయి. అలాంటి సీనియర్ మోస్ట్ పవర్‌ఫుల్ హీరోను కొరటాల శివ తన మార్కు కథనంతో ఎలా చూపిస్తారనేది? అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాలయ్యకు సైతం కొరటాల సరికొత్త ఇమేజ్ అందించడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. బాలకృష్ణలోని నటనను, భావోద్వేగాలను కొరటాల తనదైన శైలిలో వాడుకుంటే అదొక సంచలనంగా మారుతుంది. రొటీన్ తొడగొట్టడాలు, గాల్లోకి లేచే వాహనాల వంటి అతిశయోక్తులకు దూరంగా కథలోని గాంభీర్యం ద్వారానే బాలయ్య క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే సత్తా కొరటాల కలానికి ఉంది.

సామాజిక సమస్యపై పోరాడే పవర్‌ఫుల్ లీడర్‌గా బాలయ్యను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ కామ్ గా సాగుతాయి. కానీ అంతే పవర్ ఫుల్‌గానూ పాత్ర హైలైట్ అవుతుంది. అలాంటి కొర‌టాల‌- బాలయ్య క‌లిస్తే? ఆ ఎనర్జీ పీక్స్‌లో ఉంటుంది. ఇద్దరి భిన్నమైన శైలులు కలిస్తే వచ్చే అవుట్‌పుట్ టాలీవుడ్‌లో ఓ కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తుందని అభిమానులు ఆశీస్తున్నారు. బాలయ్యలోని మాస్ పవర్‌ను కొరటాల తన క్లాస్ రైటింగ్‌తో కంట్రోల్ చేస్తూ సరైన దిశలో నడిపిస్తే థియేటర్లలో సరికొత్త శకానికి నాంది పలుకుతుంది. బాల‌య్య‌ను సరికొత్త డైమెన్షన్‌లో చూడాలని ప్రేక్షకులు సైతం కోరుకుంటోన్న వేళ కొర‌టాల ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.