Begin typing your search above and press return to search.

దేవర 2.. ఆ గ్యాప్ లోనే కానిచ్చేస్తారా?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవర పార్ట్ 2 ఒకటి.

By:  M Prashanth   |   5 Aug 2025 7:00 AM IST
దేవర 2.. ఆ గ్యాప్ లోనే కానిచ్చేస్తారా?
X

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవర పార్ట్ 2 ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై మంచి విజయం దక్కించుకొని.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. తారక్ కెరీర్ లో ఇదే అత్యధిక కలెక్షన్లు (సోలో రిలీజ్ ) సాధించిన సినిమాగానూ నిలిచింది.

అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి సంకేతాలు, క్లూ లు లేవు. అసలు రెండో భాగం వస్తుందా అన్న రేంజ్ లో అభిమానులకు సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ, తాజాదా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సీక్వెల్ పై శివ తన టీమ్ తో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఈ మేరకు హీరో డేట్స్ కోసం ఎన్టీఆర్ తో కూడా చర్చలు జరిపారట.

ప్రస్తతం ఎన్టీఆర్ .. వార్ 2 ప్రమోషన్‌లు ముగిశాయి. అటు ప్రశాంత్ నీల్ చిత్రం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. దీంతో ఇదే సరైన సమయం అని శివ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కమిట్ మెంట్ లను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుని.. ఫ్రీ అవ్వాలని చూస్తున్నారట. దీంతో 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో దేవర 2 షురూ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది.

నిరంతరంగా షూటింగ్ జరిపి 2026 దసరా నాటిటి చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తోంది శివ టీమ్. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేసుకొని 2027 సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తున్నారట. దేవరకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రెండవ భాగంలో మొత్తం కథనాన్ని తిరిగి పరిశీలించి మెరుగుపరచాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంటే దేవరపై ఎవరు దాడి చేశారు, వర తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఏ పాత్ర ఏమిటి. ఇలా అన్ని అంశాలను ఇంకా బలంగా, భావోద్వేగంగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ తో పాటు, బాబీ డియోల్ పాత్ర ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమే.

ఇక ఈ సీక్వెల్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు వెయిటేజీ ఉంటుందట. ఆమే పాత్ర కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ నడుస్తుంది. అయితే, తుది నటీనటుల ఎంపిక, షెడ్యూలింగ్ నిర్ణయాలు ఇంకా పెండింగ్‌ లో ఉన్నాయి. షూటింగ్ కన్ఫార్మ్ అయితే డేట్స్ లాక్ చేస్తారు.