కొరటాల శివ వెయిటింగ్ కరక్టేనా?
దర్శకుడు కొరటాల శివ ప్రయాణం ఒక విచిత్రమైన స్థితిలో ఉంది. మిర్చి నుండి భరత్ అనే నేను` వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన కొరటాల ఆచార్య ఫలితం తర్వాత కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు.
By: Srikanth Kontham | 25 March 2026 1:43 PM ISTదర్శకుడు కొరటాల శివ ప్రయాణం ఒక విచిత్రమైన స్థితిలో ఉంది. మిర్చి నుండి భరత్ అనే నేను` వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన కొరటాల ఆచార్య ఫలితం తర్వాత కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయితే ఎన్టీఆర్‌తో తీసిన 'దేవర' సినిమాతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ కొరటాల తదుపరి ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న నిశ్శబ్దం సినీ వర్గాల్లో నిరంతరం చర్చగానే మారింది. ఒక స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కొరటాల శివ ఇంత కాలం ఖాళీగా ఉండిపోవడం సరైన నిర్ణయమేనా? అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
`దేవర పార్ట్-1 ఘన విజయం సాధించిన తర్వాత పార్ట్-2 కోసం ఆయన ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా కొరటాలకు చాలా సమయం వృద్దా అవుతోంది. దర్శకుడికి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి లాంగ్ గ్యాప్స్ రావడం కొంత ఇబ్బందికరమే. టాలీవుడ్‌లోని ఇతర టాప్ డైరెక్టర్లను గమనిస్తే బిగ్ స్టార్స్ అందుబాటులో లేనప్పుడు వారు ఖాళీగా లేకుండా ఇతర హీరోలతో లేదా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ కూడా ఒక మెట్టు దిగి టైర్-2 హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉంది.
ఆయనకు ఉన్న క్రేజ్ , మేకింగ్ స్టైల్‌కు ఏ యంగ్ హీరో అయినా డేట్స్ ఇస్తారు. కానీ కొరటాల మాత్రం కేవలం ఎన్టీఆర్ కోసమే సమయాన్ని కేటాయించడం అన్నది సాహసోపేతమైన నిర్ణయంగానే కనిపిస్తోంది. ఇలా వెయిటింగ్ తో కొరటాల శివ తన కెరీర్‌లో అత్యంత విలువైన కాలాన్ని కోల్పోతున్నారనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. దేవర 2 పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఈ లోపు ఆయన మరో చిన్న చిత్రాన్ని పూర్తి చేయగలిగితే ఇండస్ట్రీకి మంచి సినిమా దొరుకుతుంది. ఇటు దర్శకుడిగా ఆయన కూడా టచ్‌లో ఉన్నట్లు అవుతుంది.
కానీ కొరటాల శివ మాత్రం తన దృష్టంతా దేవర2 మీదనే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఓ రకంగా చూస్తే ఇది కొరటాలకు ఉన్న కట్టుబాటు ను సూచిస్తుంది. ఒక భారీ ప్రాజెక్టును సగంలో వదిలేసి లేదా పక్కన పెట్టి మరో సినిమా చేయడం వల్ల దేవర 2 పై ఏకాగ్రత దెబ్బతింటుందని ఆయన భావిస్తుండవచ్చు. కానీ టెక్నికల్ గా చూస్తే ఒక సినిమా పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ లెక్కన చూస్తే కొరటాల శివ మరికొన్ని ఏళ్ల పాటు కేవలం ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇది దర్శకుడిగా ఆయన అవుట్‌పుట్ సంఖ్యను తగ్గిస్తుంది. అయితే ఈ వెంటింగ్ అన్నది సరైనా నిర్ణయమా? కాదా? అన్నది దేవర 2 ఫలితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ అయితే విమర్శించిన నోళ్లే ప్రశంసింస్తాయి. ప్లాప్ అయితే ఆ విమర్శలే పతాక స్థాయికి తీసుకెళ్తాయి. మరి ఈ పరిస్థితిని కొరటాల ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అన్నది చూడాలి.
