Begin typing your search above and press return to search.

కొరటాల నెక్స్ట్ ఏంటి? ఆ హీరోతో చేయడమే బెటరా?

ఆ తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త మూవీని అనౌన్స్ చేయలేదు. ఆయన లైనప్ లో దేవర సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   26 Nov 2025 8:00 PM IST
కొరటాల నెక్స్ట్ ఏంటి? ఆ హీరోతో చేయడమే బెటరా?
X

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. భద్ర, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి హిట్ సినిమాలకు వర్క్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ మిర్చి మూవీతో డైరెక్టర్ గా మారారు. డెబ్యూతోనే మంచి హిట్ అందుకుని సత్తా చాటారు. అనంతరం వివిధ సినిమాలను తెరకెక్కించారు.

వాటిలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, దేవర: పార్ట్ 1 వంటి పలు విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. అయితే కెరీర్ లో ఒకే ఒక్క ఫ్లాప్ ను ఆచార్య మూవీ రూపంలో అందుకున్నారు. విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. కానీ దేవర: పార్ట్ 1 మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు కొరటాల శివ.

ఆ తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త మూవీని అనౌన్స్ చేయలేదు. ఆయన లైనప్ లో దేవర సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ దేవర-2 ఉంటుందని ఇప్పటికే తారక్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల టైమ్ దేవర-2 పట్టాలెక్కడానికి అయితే కచ్చితంగా పడుతుంది.

ప్రస్తుతం దేవర-2 స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేసి.. కొరటాల ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. బడా హీరోలు, మీడియం రేంజ్ హీరోలంతా ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వరుస చిత్రాలు లైన్ లో పెట్టారు. కుర్ర హీరోలు రామ్, నాగ చైతన్యతో కొరటాల సినిమాలు చేస్తారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.

కానీ అది నిజం కాదని ఇటీవల క్లారిటీ కూడా వచ్చింది. అయితే సీనియర్ హీరోలు కాకుండా మిగతా వారితో వర్క్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ కథ రచన, మేకింగ్ అండ్ టేకింగ్ లో మంచి టాలెంట్ ఉన్న ఆయన.. బాలకృష్ణతో జత కడితే సరిగ్గా సరిపోతుందని ఇప్పుడు కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మాస్ జోనర్ లో బాలయ్య అదరగొడతారు.. అదే జోనర్ లో కొరటాల కూడా సక్సెస్ అయ్యారు. కాబట్టి బాలయ్యతో అలాంటి జోనర్ లో సినిమా చేస్తే.. ఆడియన్స్ ను ఆకట్టుకునే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం నటసింహం అఖండ-2ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేనితో మరోసారి వర్క్ చేస్తున్నారు. తాజాగా మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మరి కొరటాల, బాలయ్య కాంబోలో మూవీ వస్తుందో రాదో వేచి చూడాలి.