Begin typing your search above and press return to search.

కొరటాల.. ఈ ట్విస్ట్ ఏంటి? భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?

టాలీవుడ్‌ లో మరో క్రేజీ కాంబినేషన్‌ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దర్శకుడు కొరటాల శివ తదుపరి ప్రాజెక్ట్‌ పై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

By:  M Prashanth   |   19 April 2026 12:01 AM IST
కొరటాల.. ఈ ట్విస్ట్ ఏంటి? భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
X

టాలీవుడ్‌ లో మరో క్రేజీ కాంబినేషన్‌ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దర్శకుడు కొరటాల శివ తదుపరి ప్రాజెక్ట్‌ పై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ విజయానంతరం ఆయన పూర్తిగా సీక్వెల్‌ పై ఫోకస్ చేస్తారని అందరూ భావించినా, ఇప్పుడు పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి.

దేవరలో ఎన్టీఆర్ యాక్టింగ్ ను భారీ రెస్పాన్స్ లభించడంతో, దేవర 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో దేవర 2 షూటింగ్ కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆ గ్యాప్‌ ను వేస్ట్ చేయకుండా కొరటాల శివ మరో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథను నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు వినిపించగా, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది. దీంతో దేవర 2 కంటే ముందే ఆ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌ లో ఉన్నారు. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్‌ తో పాటు, కొరటాల శివ సోషల్ మెసేజ్‌ లతో కూడిన కథన శైలి కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ ఫలితాలు సాధించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఆ కాంబినేషన్ నిజమైతే ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

నిజానికి బాలకృష్ణ లైనప్ కూడా ప్రస్తుతం స్ట్రాంగ్ గా ఉంది. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తుండగా..వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి దర్శకులతో కూడా ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొరటాల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తిగా మారింది. అదే సమయంలో దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది తెలియదు.

ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సీక్వెల్ మరింత కీలకమైందని, కథలో కీలక మలుపులు ఉండబోతున్నాయని సమాచారం. దేవర మొదటి భాగం క్లైమాక్స్‌లో అనేక ప్రశ్నలు మిగిల్చిన సంగతి తెలిసిందే. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కొంత నిరాశ ఉన్నా, మధ్యలో మరో భారీ ప్రాజెక్ట్‌ తో కొరటాల అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా కొరటాల- బాలకృష్ణ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్టే ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ కంటే ముందే బాలయ్యతో కొరటాల సినిమా పూర్తి చేస్తారా? అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.