వాళ్లను బ్యాన్ చేస్తే.. అంతా సెట్ అయిపోతుందా?
సినిమా హిట్ అయితే అందరూ హీరోలే.. ఫ్లాప్ అయితే మాత్రం విమర్శలు వస్తుంటాయి.
By: M Prashanth | 10 Oct 2026 10:56 PM ISTసినిమా హిట్ అయితే అందరూ హీరోలే.. ఫ్లాప్ అయితే మాత్రం విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే నష్టాల గురించి చర్చ మొదలవుతుంది. నిర్మాతకు వచ్చిన నష్టమెంత.. సినిమా ఎందుకు ఆడలేదు.. ఎక్కడ తప్పు జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే, సినిమా విడుదలయ్యాక తప్పులు వెతకడం కంటే.. అసలు ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమనే చర్చ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
ప్రముఖ రైటర్ కోన వెంకట్ చేసిన కామెంట్సే ఆ డిబేట్ ను స్టార్ట్ చేశాయి. మూడు గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో సినిమా తీసి.. అందులో గంటా 50 నిమిషాల ఫుటేజ్ కట్ చేయాల్సి వస్తే, అంత ఖర్చు పెట్టి షూటింగ్ చేయడం వల్ల ఉపయోగమేంటని క్వశ్చన్ చేశారు. ఇలాంటి తప్పులు చేసే వారిని ఇండస్ట్రీ బ్యాన్ చేయాలన్న ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
అయితే ఇండస్ట్రీ నుంచి దర్శకులను బ్యాన్ చేయాలా వద్దా అనేది మాత్రమే కాదు. ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు.. ఆ డబ్బు సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సినిమా ప్రొడక్షన్ అనేది ఒక్కరి నిర్ణయంతో పూర్తయ్యే పని కాదు. స్టోరీ దగ్గర మొదలైన జర్నీ.. స్క్రిప్ట్, క్యాస్టింగ్ సెలక్షన్, షూటింగ్, ఎడిటింగ్, రిలీజ్ వరకు ఎన్నో స్టేజెస్ దాటుతుంది.
సరైన ప్లాన్ ఉంటే అనవసరపు ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా భారీ సినిమాల విషయంలో అది మరింత ఎక్కువుతోంది. కనిపించని సీన్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. స్టోరీకి అవసరం లేదని వాటిని తీసేస్తే.. అందుకోసం పెట్టిన డబ్బు, టైమ్ వేస్ట్ అవుతాయి. అయితే ప్రతి కట్ ను మిస్టేక్ గా చూడలేం. ఎడిటింగ్ లో భాగంగా కొన్ని సీన్స్ తొలగించడం సహజమే. కానీ ప్లాన్ లేకపోవడం వల్లే పెద్ద మొత్తంలో ఫుటేజ్ తొలగించాల్సి వస్తే మాత్రం ఆలోచించాల్సిందే.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రొడక్షన్ టైమ్ లో తీసుకున్న డెసిషన్స్ కు మాత్రం డైరక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాన్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అనుకునే కంటే.. అన్ని విషయాలపై క్లారిటీ ఉండేలా చూడటం ముఖ్యం. నిర్మాతలు కూడా భారీ మొత్తాలను ఖర్చు చేసే ముందు ప్రాజెక్టుపై సరైన అంచనా వేసుకోవాలి. దర్శకుడి క్రియేటివిటీకి ఫ్రీడమ్ ఇస్తూనే, ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి.
ఎందుకంటే కొందరిని బ్యాన్ చేసినంత మాత్రాన నష్టాలు ఆగిపోవు. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి, మార్చుకుంటేనే అంతా సెట్ అవుతుంది. సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ముందే చెప్పలేం. కానీ వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవడం, ప్లాన్ తో ముందుకెళ్లడం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఎవరిని బ్యాన్ చేయాలనేది కాకుండా.. మిస్టేక్స్ జరగకుండా ఏం చేయాలో డిస్కస్ చేసుకోవాలి.
