Begin typing your search above and press return to search.

అలాంటి పాత్రలు కావాలంటున్న నాని బ్యూటీ.. వర్కౌట్ అవుతుందా?

అలాంటి సినిమాల్లో నటించి తమ డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకోవాలి అనుకుంటారు.అలా తాజాగా నాని హీరోయిన్ కూడా నా టార్గెట్ అదే అని..అలాంటి సినిమాలు చేయడం ఇష్టం అంటోంది.

By:  Madhu Reddy   |   29 Aug 2025 2:00 PM IST
అలాంటి పాత్రలు కావాలంటున్న నాని బ్యూటీ.. వర్కౌట్ అవుతుందా?
X

చాలామంది నటీనటులు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా తమకి నచ్చే జానర్ లు,పాత్రలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల్లో నటించి తమ డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకోవాలి అనుకుంటారు.అలా తాజాగా నాని హీరోయిన్ కూడా నా టార్గెట్ అదే అని..అలాంటి సినిమాలు చేయడం ఇష్టం అంటోంది. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు కోమలి ప్రసాద్.. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హిట్ మూవీ ఫ్రాంచైజీస్ ఎంత బాగా హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు.విశ్వక్ సేన్ తో మొదలైన హిట్ ది ఫస్ట్ కేస్,అడివి శేష్ తో హిట్ ది సెకండ్ కేస్, నానితో హిట్-3 ఇలా కొనసాగుతూ వచ్చాయి.

ఒకప్పుడు హీరోయిన్.. హిట్ ఫ్రాంఛైజీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్..

అంతేకాదు శైలేష్ కొలను మైండ్లో ఇంకా చాలా సీక్వెల్స్ కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. అలా శైలేష్ కొలను ఇప్పటివరకు చేసిన ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమాల్లో కోమలి ప్రసాద్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ అలాగే నాని పక్కన కనిపించింది. అయితే ఈ సినిమాల్లో కోమలి ప్రసాద్ సహాయకపు పాత్రలో నటించగా.. దాని గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ పోస్ట్ పెట్టారు. మీరు హిట్ ఫ్రాంచైజీలో సహాయకపు పాత్రలో నటిచినందుకు బాధపడకండి.ఇలాంటి పోలీస్ పాత్రలో నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఆ పాత్ర కోసం చాలా కష్టపడి.. ఆ పాత్రలో చాలా బాగా నటించారు అని పోస్ట్ పెట్టాడు.

అలాంటి పాత్రలు చేయాలని ఉంది - కోమలి ప్రసాద్

సదరు నెటిజన్ పెట్టిన పోస్ట్ కి కోమలి ప్రసాద్ రిప్లై ఇస్తూ.. "నేను హిట్ ఫ్రాంచైజీలో భాగమైనందుకు ఎప్పుడు బాధపడలేదు.అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఒక పెద్ద హీరో పక్కన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం మామూలు విషయం కాదు.. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ నాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు ఎంతో ఆనందగా ఉన్నాను. అలాగే నాకు వచ్చిన ఈ ఛాన్స్ నా పాత్ర గురించి ప్రేక్షకులకు తెలుసు.. హిట్ ఫ్రాంచైజీలో నటిస్తున్న సమయంలో నా నటనను మెచ్చి ఎంతో మంది అభిమానులకు నేను దగ్గరయ్యాను.. హిట్ ఫ్రాంచైజీ తర్వాత ఇలాంటి విభిన్న సినిమాలు ఎన్నో నటించగలను అనే నమ్మకం నాలో కలిగింది. నాకు ఉన్న డ్రీమ్.. ఏంటంటే ఐకానిక్ మార్షల్ ఆర్ట్స్ రివైంజ్ డ్రామా అయినటువంటి కిల్ బిల్ వంటి పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటించాలన్నదే నా కోరిక".. అంటూ తన డ్రీమ్ బయట పెట్టింది..

కోమలి ప్రసాద్ సినిమాలు..

కోమలి ప్రసాద్ సినిమాల విషయానికి వస్తే.. నేను సీతాదేవి అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ PC524, హిట్ -2, హిట్-3 వంటి సినిమాల్లో నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.