విశాల్ సినిమాకు డైరెక్టర్స్ అసోసియేషన్ చెక్..!
ఇప్పటికే విశాల్ తో సినిమా అంటేనే ఆలోచించే పరిస్థితిలో ఉండగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా విషయంలో కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యి షాక్ ఇచ్చింది.
By: Ramesh Boddu | 31 Oct 2025 4:05 PM ISTకోలీవుడ్ హీరో విశాల్ సినిమా ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటుంది. సినిమాకు స్వతహాగా పబ్లిసిటీ ఇచ్చుకునే అవసరం లేకుండా విశాల్ సినిమా ప్రతి ఒక్కటి కూడా సెట్స్ మీద ఉన్నప్పుడే రకరకాల వార్తలతో వైరల్ అవుతుంది. ఇప్పటికే విశాల్ తో సినిమా అంటేనే ఆలోచించే పరిస్థితిలో ఉండగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా విషయంలో కూడా మళ్లీ అదే రిపీట్ అయ్యి షాక్ ఇచ్చింది. విశాల్ హీరోగా రవి అరసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మాగుదం. ఈ సినిమా షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేశారు మేకర్స్.
విశాల్ సినిమాలకు మాత్రమే డిస్ట్రబెన్స్..
అలా ఎందుకు అంటే డైరెక్టర్ రవి అరసుని ప్రాజెక్ట్ నుంచి విశాల్ తీసి వేశారు. దాని వెనక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ డైరెక్టర్ ని అర్ధాంతరంగా తప్పించినందుకు డైరెక్టర్ అసోసియేషన్ తో పాటు FEFSI కూడా విశాల్ నిర్ణయం మీద అసంతృప్తిగా ఉన్నారు.. అంతేకాదు రవి అరసు నుంచి నో అబ్జెక్షన్ తీసుకున్న తర్వాతే సినిమా షూటింగ్ చేయాలని అసోసియేషన్ డిక్లేర్ చేసింది.
అప్పటివరకు ఎవరు షూటింగ్ లో పాల్గొనేందుకు వీలు లేదని అంటున్నారు. విశాల్ సినిమాలకు మాత్రమే ఇలాంటి డిస్ట్రబెన్స్ లు వస్తున్నాయి. అంతకుముందు మిస్కిన్ తో కూడా ఇలాంటి గొడవల వల్లే అతనితో సినిమా మధ్యలో ఆగిపోయింది. విశాల్ తన సినిమా విషయంలో ప్రతీది తనకు నచ్చినట్టుగా చేస్తాడన్న టాక్ ఉంది. ఐతే డైరెక్టర్ తో కలిసి అతని ఆలోచనలు తగినట్టుగా తన ఇన్ పుట్స్ ఇవ్వాలి. ఓవరాల్ గా అది సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు సహకరించాలి.
సినిమా సగం పూర్తయ్యాక డైరెక్టర్ ని తీసేస్తే..
అలా కాకుండా సగం సినిమా పూర్తయ్యాక డైరెక్టర్ ని సినిమా నుంచి తప్పిస్తే కచ్చితంగా ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ రావడం కష్టం అవుతుంది. విశాల్ తన సినిమా గొప్పగా రావాలన్న ఆలోచనతోనే ఇది చేస్తున్నట్టు అనిపిస్తున్నా.. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే అంతా ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు.. లేదా సినిమా సగం పూర్తయ్యాక డైరెక్టర్ ని తీసేస్తా అంటే డైరెక్టర్స్ అసోసియేషన్ ఒప్పుకునే ఛాన్స్ లేదు.
విశాల్ సినిమా షూటింగ్ కొనసాగిస్తాడా లేదా సరైన క్లారిటీ ఇచ్చి వేరే డైరెక్టర్ కి మూవ్ ఆన్ అవుతారా అన్నది చూడాలి. విశాల్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు అందుకోవట్లేదు. ఆ ప్రెజర్ కూడా ఉండి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్స్ ని ఇలా మార్చడం మాత్రం అసలేమాత్రం ఆమోద యోగం కాదని చెప్పొచ్చు.
