Begin typing your search above and press return to search.

కంటెంట్‌ పై ఫోకస్ పెట్టకుండా ఏడుపులు ఏంటి?

కానీ ఇటీవల తమిళ సినీ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న కామెంట్స్ చూస్తే, అసలు సమస్య పక్కనపెట్టి తెలుగు పరిశ్రమపై నిందలు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  M Prashanth   |   20 Jun 2026 8:00 AM IST
కంటెంట్‌ పై ఫోకస్ పెట్టకుండా ఏడుపులు ఏంటి?
X

ఒక మంచి సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం స్టార్ హీరో సరిపోడు. స్ట్రాంగ్ స్టోరీ సరైన కంటెంట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్ కూడా ఉండాలి. కానీ ఇటీవల తమిళ సినీ ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న కామెంట్స్ చూస్తే, అసలు సమస్య పక్కనపెట్టి తెలుగు పరిశ్రమపై నిందలు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలకు భారీ పారితోషికాలు ఇవ్వడం వల్ల మొత్తం సౌత్ సినిమా మార్కెట్ ఫైనాన్సియల్ సిచ్యువేషన్లు మారిపోయాయని కొందరు కోలీవుడ్ నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఒకసారి భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోలు, తమ తదుపరి సినిమాలకు కూడా అదే స్థాయి పారితోషికం కోరుతున్నారని వారు చెబుతున్నారు. దీంతో తమిళ నిర్మాతలపై ఆర్థిక భారం పెరిగిందని అంటున్నారు.

అందుకే వాళ్ల దగ్గర కూడా అదే రేంజ్ లో పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని, సినిమా హిట్ అయినా పెట్టుబడి తిరిగి రావడం కష్టమవుతోందని అంటున్నారు. అయితే ఆ కామెంట్స్ ను ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రియులు సమర్థించడం లేదు. అంతే కాదు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఏదేమైనా సినిమా సక్సెస్ ను పారితోషికాలతో కొలవలేమని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి రెస్పాన్స్ పొందడానికి ప్రధాన కారణం కంటెంట్, మార్కెటింగ్ ప్లాన్ అని చెబుతున్నారు.

ప్రేక్షకులు ఇప్పుడు భాషను కాకుండా సినిమా క్వాలిటీని చూస్తున్నారు. కథ బాగుంటే ఏ లాంగ్వేజ్ మూవీని అయినా ఆదరిస్తున్నారు. గత కొన్నేళ్లలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఆ సక్సెస్ ల వెనుక కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే కాకుండా, కంటెంట్ పై పెట్టిన ఫోకస్ కీలక పాత్ర పోషించింది.

దీంతో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగినప్పుడు రెమ్యూనరేషన్లు కూడా పెరగడం సహజమేనని టాక్! ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్న బడ్జెట్‌ తో వచ్చిన చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధించాయి. అలాంటి సమయంలో విజయాలకు కారణం కథ అయితే, సమస్యకు కారణంగా తెలుగు నిర్మాతలను చూపించడం సరైనది కాదని అభిప్రాయం వినిపిస్తోంది.

మరోవైపు అజిత్ వంటి స్టార్ హీరోలు కొత్త సినిమాలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కూడా తెలుగు పరిశ్రమనే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ హీరోలు కథ, దర్శకుడు, ప్రొడక్షన్ ప్లాన్, మార్కెట్ పరిస్థితులు వంటి అనేక అంశాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కేవలం రెమ్యూనరేషన్ సమస్యకు మాత్రమే లింక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాలి.

అయితే సినీ ఇండస్ట్రీలో పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ టాప్ లో ఉంటే, మరో పరిశ్రమ కొత్త ప్లాన్ తో ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ సమస్యలన్నింటికీ పక్క ఇండస్ట్రీని కారణంగా చూపడం కంటే, ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారనే విషయంపై దృష్టి పెట్టడం మరింత అవసరం. ఎందుకంటే చివరికి ప్రేక్షకుడికి కావాల్సింది మంచి సినిమా మాత్రమే. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటప్పుడు కంటెంట్‌ పై ఫోకస్ పెట్టకుండా ఇతర పరిశ్రమలపై విమర్శలు చేయడం వల్ల యూజ్ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.