టాలీవుడ్ స్పూర్తితోనే అరవోళ్లు బరిలోకి!
ఒకప్పుడు సీక్వెల్స్ అంటే బాలీవుడ్ నుంచే కనిపించేవి. బ్లాక్ బస్టర్ అయిందంటే అదో ప్రాంచైజీగా మారేది. వరుసగా నాలుగైదు చిత్రాలు అదే ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతుండేవి.
By: Srikanth Kontham | 15 Dec 2025 2:00 PM ISTఒకప్పుడు సీక్వెల్స్ అంటే బాలీవుడ్ నుంచే కనిపించేవి. బ్లాక్ బస్టర్ అయిందంటే అదో ప్రాంచైజీగా మారేది. వరుసగా నాలుగైదు చిత్రాలు అదే ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతుండేవి. 20 ఏళ్ల క్రితం నాటి సినిమాలకు సైతం సీక్వెల్స్ తెరకెక్కించిన ఘతన వాళ్లకే సొంతం. ఇప్పటికీ ఆ ట్రెండ్ అక్కడ అమలులో ఉందన్నది కాదనలేని నిజం. వాళ్లను చూసి టాలీవుడ్ లో కూడా సీక్వెల్స్ ట్రెండ్ మొదలైంది. ఒకే కథని రెండు భాగాల్లో చెప్పడం...కంటున్యూటీ పేరుతో సీక్వెల్స్ తెరపైకి తేవడం పరిపారిటిగా మారింది. ప్రముఖంగా పాన్ ఇండియా కథల విషయంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.
జోరందుకున్న సీక్వెల్స్ :
రీజనల్ మార్కెట్ ను ఆధారంగా చేసుకుని హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు భాషల్నీ చూసి కోలీవుడ్ కూడా సీక్వెల్స్..ప్రాంచైజీ వరల్డ్ లోకి అడుగు పెట్టింది. లోకేష్ కనగరాజ్, మిస్కిన్, మిత్రన్, నెల్సన్ దిలీప్ కుమార్, సెల్వ రాఘవన్ లాంటి వారు సీక్వెల్స్ లో జోరు చూపిస్తున్నారు. ప్రముఖంగా అందుకు స్పూర్తి నిచ్చింది ఎవరు అంటే టాలీవుడ్ అనే చెప్పాలి. తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో సక్సెస్ అయిన తీరు చూసి? తామెందుకు సీక్వెల్స్ తీయకూడదు అన్న ఆలోచనతో వడి వడిగా మొదలైన అడుగులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.
ట్రెండింగ్ లో వీరే:
ఈ సీక్వెల్స్ ట్రెండింగ్ లో నిలిచిన దర్శకులు ఎవరు? అంటే ప్రముఖంగా ఇద్దరు హైలైట్ అవుతున్నారు. వారే లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ `జైలర్ 2` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్ల టార్గెట్ బరిలోకి దిగుతుంది. మొదటి భాగం `జైలర్` 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో? రెండవ భాగం సునాయాసంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి? అన్నది కాదనలేని నిజం.
2026 లో ఖైదీ 2 షురూ:
ఇప్పటి వరకూ కోలీవుడ్ కు 1000 కోట్ల క్లబ్ అన్నది అందని ద్రాక్షగానే ఉంది. లోకేష్ కనగరాజ్ ఎల్ సీ యూ నుంచి కొన్ని ప్రయత్నాలు చేసాడు కానీ ఫలించలేదు. 500 కోట్ల మార్క్ ని టచ్ చేసినా? విమర్శలు ఎదుర్కున్నాడు. ఇప్పుడా విమర్శలకు ధీటైన బధులివ్వాల్సిన తరుణం ఇది. దీనిలో భాగంగా `ఖైదీ` 2 సమాయత్తం అవుతోంది. `ఖైదీ`కి సౌత్ మార్కెట్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ` ఖైదీ 2` ని అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విజయంతో వచ్చిన విమర్శలన్నింటికి ధీటైన బధులివ్వాలనుకుంటున్నాడు. ప్రాజెక్ట్ ఆలస్యమైనా? బ్లాక్ బస్టర్ `ఖైదీ 2` తోనే రావాలని బ్యాకెండ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. కానీ లోకేష్ కనగరాజ్ హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షంచుకునే పనిలో పడటంతో డిలే అవుతుంది. వచ్చే ఏడాది `ఖైదీ 2` మొదలవుతుంది.
