Begin typing your search above and press return to search.

తమిళ దర్శకుల టాలీవుడ్ సక్సెస్ స్టోరీ.. ఈ ఐదుగురి గురించి తెలుసా?

నటుడిగా విలక్షణ పాత్రలతో దూసుకెళ్తున్న ఎస్.జె. సూర్య, దర్శకుడిగా కూడా టాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

By:  Madhu Reddy   |   21 Oct 2026 8:00 PM IST
తమిళ దర్శకుల టాలీవుడ్ సక్సెస్ స్టోరీ.. ఈ ఐదుగురి గురించి తెలుసా?
X

ఒక భాషకు చెందిన నటీనటులు ఇతర భాషల్లో నటించడం సర్వసాధారణమే అయినప్పటికీ, వేరే ఇండస్ట్రీకి చెందిన దర్శకులు వచ్చి ఇక్కడ సినిమాలు చేయడం, అందులోనూ స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్లు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కోలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎస్.జె. సూర్య - పవన్ కళ్యాణ్‌తో సెన్సేషన్:

నటుడిగా విలక్షణ పాత్రలతో దూసుకెళ్తున్న ఎస్.జె. సూర్య, దర్శకుడిగా కూడా టాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖుషి' సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ లవ్ అండ్ ఎంటర్‌టైనర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌తో 'కొమరం పులి' వంటి చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

సురేష్ కృష్ణ - టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు:

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'బాషా' వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన సురేష్ కృష్ణ, తెలుగులోనూ తన సత్తా చాటారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్రనాయకులతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ - క్లాసిక్ లవ్ మేకర్:

స్టైలిష్ మరియు క్లాసిక్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గౌతమ్ మీనన్, తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నైబరింగ్ డైరెక్టర్‌లాగే కనిపిస్తారు. వెంకటేష్‌తో 'ఘర్షణ' వంటి పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా, నాగచైతన్య - సమంతలతో తెరకెక్కించిన 'ఏ మాయ చేసావే' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెలుగు యువత హృదయాలను కొల్లగొట్టారు.

సెల్వరాఘవన్ - ఎమోషనల్ అండ్ ఇంటెన్స్:

ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సెల్వరాఘవన్, విక్టరీ వెంకటేష్‌తో చేసిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ హిట్ .ఇక టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకున్నారు. ఇక విభిన్నమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందించడంలో ఈయన ఎప్పుడూ ముందుంటారు.

ఏ.ఆర్. మురుగదాస్ - మెగాస్టార్‌తో హిట్:

మాస్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే దర్శకుడిగా మురుగదాస్ పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో 'స్టాలిన్' వంటి అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా సామాజిక స్పృహతో కూడిన మంచి సందేశాన్ని అందించారు.

ఇక మొత్తానికి చూస్తే, కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చి ఇక్కడి ప్రేక్షకులను తమ సినిమాలతో అలరించిన ఈ ఐదుగురు దర్శకులు తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భాష ఏదైనా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ దర్శకుల విజయాలే నిదర్శనం.