Begin typing your search above and press return to search.

దీపావళికి హాట్ హాట్ అప్‌డేట్!

గత ఎనిమిది సీజన్లు పూర్తి చేసిన క‌ర‌ణ్ ఈ ఏడాది దీపావళి కానుకగా కొత్త సీజ‌న్ 9 స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా ధృవీకరించారు.

By:  Srikanth Kontham   |   26 April 2026 8:00 AM IST
దీపావళికి హాట్ హాట్ అప్‌డేట్!
X

కరణ్ జోహార్ పాపులర్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` సీజన్ 9తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. గత ఎనిమిది సీజన్లు పూర్తి చేసిన క‌ర‌ణ్ ఈ ఏడాది దీపావళి కానుకగా కొత్త సీజ‌న్ 9 స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా ధృవీకరించారు. గత సీజన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో? ఈసారి షోలో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించారు. సీజన్ ఎనిమిదిలో రాపిడ్ ఫైర్ రౌండ్ తన కెరీర్‌లోనే అత్యంత బోర్ కొట్టించిన రౌండ్ అని కరణ్ స్వయంగా అంగీక‌రించారు. అందుకే ఈసారి సీజన్ 9ని సరికొత్త పంథాలో తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు.

మారుతోన్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా షో ఫార్మాట్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నామ‌న్నారు. దీనిలో భాగంగా సెగ్మెంట్లను కూడా తగ్గించి వేగంగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి షోలో బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర రంగాల ప్రముఖులు కూడా కనిపించనున్నారు. ఈ కొత్త సీజన్ గెస్ట్ లిస్ట్ విషయంలో కరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దక్షిణ భారత స్టార్ హీరోలు, ఓటిటి నటులు , ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను కూడా ఈసారి షోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్లు గత సీజన్లలో మెరిసినా? ఈసారి మరిన్ని క్రేజీ కాంబినేషన్లను ప్రేక్షకులు ఆశించొచ్చు.

గ్లామర్ , గాసిప్స్‌కు తోడుగా ఈసారి సమాజంలోని విభిన్న అంశాలపై చర్చలు కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ షో `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్` లో స్ట్రీమింగ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే కొత్త సీజ‌న్ జియో హాట్‌స్టార్ కి మారింది. 2004లో ప్రారంభమైన ఈ షో దాదాపు రెండు దశాబ్దాలుగా టెలివిజన్ , డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ప్రతి ఏటా వివాదాలకు ఆసక్తికరమైన విషయాలకు వేదికగా నిలిచే ఈ షో ఈసారి దీపావళికి బాణ సంచా లాంటి అప్‌డేట్లతో రాబోతుంద‌ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బ్యాకెండ్ లో కరణ్ జోహార్ షోను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. ఎనిమిదవ సీజన్ లోపాలను సరిదిద్దుకుని సరికొత్త ఉత్సాహంతో రాబోతున్న షో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాలీవుడ్ ఇన్సైడ్ విషయాలను బయట పెట్టడంలో దిట్ట అయిన కరణ్ ఈసారి అతిథుల నుండి ఎలాంటి గాసిప్స్ బయటకు తీస్తారో? అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.