పెద్ది ఎఫెక్ట్.. రామ్ చరణ్ ను క్లీంకారా ఏమని పిలుస్తోందో తెలుసా?
ఇదిలా ఉండగా మరొకవైపు విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరడంతో ఈ సినిమా బృందం సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ ను గ్రాండ్గా నిర్వహించింది.
By: Madhu Reddy | 24 Jun 2026 9:59 AM ISTబుచ్చిబాబు సన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం పెద్ది. రూరల్ డ్రామా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా ప్రకటించిన రోజు నుంచే ఎప్పటికప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చిన మేకర్స్.. అన్నట్టుగానే ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చారు. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ సినిమాగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ది పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
గ్రాండ్ గా పెద్ది మెగా బ్లాక్ బాస్టర్ ఈవెంట్..
ఇదిలా ఉండగా మరొకవైపు విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరడంతో ఈ సినిమా బృందం సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ మేరకు హైదరాబాదులోని శిల్పకళ వేదికగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు పెద్ది గ్రాండ్ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి విచ్చేసారు. అలాగే రామ్ చరణ్ తో తదుపరి సినిమా చేయబోతున్న డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేశారు.
నా కూతురు నన్ను అలా పిలుస్తోంది - రామ్ చరణ్
ఇకపోతే ఈ సక్సెస్ మీట్ లో భాగంగా రామ్ చరణ్ పెద్ది ఎఫెక్ట్ తన కుటుంబ సభ్యులపై ఏ విధంగా పడింది అనే విషయాన్ని చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన రామ్ చరణ్ పెద్ది విషయాలను అభిమానులతో పంచుకుంటూనే తన కూతురు గురించి మాట్లాడుతూ.." ఇంట్లో మా బుడ్డది పెద్ది నాన్న అంటూ ముద్దుగా పిలుస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది" అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే క్లీంకారా తన నాన్నను పెద్ది నాన్న అని పిలుస్తోందంటే పెద్ది సినిమా ఎఫెక్ట్ ఆ చిన్నారిపై ఏ రేంజ్ లో పడిందో అర్థం అవుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్ ను తన కూతురు అలా పిలవడం చూసి మెగా అభిమానులు ఈ విషయాన్ని తెగ షేర్ చేస్తూ ఉండడం గమనార్హం.
మెగా కుటుంబానికి తొలి వారసురాలు..
క్లీంకార విషయానికి వస్తే.. మెగా కుటుంబంలోకి తొలి వారసురాలిగా అడుగు పెట్టింది క్లీంకార. 2023లో జన్మించిన ఈ చిన్నారి ముఖాన్ని చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కనీసం ఈసారైనా పాపని చూపిస్తారు అంటూ ప్రతి బర్తడే కి ఎదురు చేశారు. కానీ మూడు సంవత్సరాల పూర్తయి ఇప్పుడు నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఏడాది పాప ముఖాన్ని రివీల్ చేసి సర్ప్రైజ్ చేశారు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన. ఇక క్లీంకారా చూడడానికి చాలా ముద్దుగా ఉంది అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
