Begin typing your search above and press return to search.

హ్యాపీ బర్తడే క్లీన్ కారా.. మెగా కుటుంబంలో ఊహించని అదృష్టం!

మెగా ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల ఈ లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి.

By:  Madhu Reddy   |   20 Jun 2026 4:52 PM IST
హ్యాపీ బర్తడే క్లీన్ కారా.. మెగా కుటుంబంలో ఊహించని అదృష్టం!
X

మెగా ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల ఈ లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు పుట్టినరోజు వేడుకలు (జూన్ 20న) మెగా ఫ్యామిలీలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. క్లీంకార పుట్టినప్పటి నుంచి మెగా ఇంట్లో అన్నీ వరుస శుభకార్యాలే జరుగుతుండటంతో, అభిమానులంతా ఆమెను ఒక ‘అదృష్ట దేవత’లా, మెగా ఫ్యామిలీ ‘లక్కీ బేబీ’గా కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ చెప్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం..

మెగా ఇంట్లో అడుగుపెట్టిన అదృష్ట దేవత:

2023 జూన్ 20న క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పాప పుట్టినప్పటి నుంచే మెగా కుటుంబంలో ఊహించని అదృష్టాలు, వరుస విజయాలు మొదలయ్యాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన 'పద్మవిభూషణ్' రావడం, అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి డిప్యూటీ సీఎం కావడం అన్ని హ్యాపీ మూమెంట్స్.

చరణ్-ఉపాసనలకు కవల పిల్లలు.. డబుల్ ధమాకా:

ఈ ఏడాదైతే మెగా ఫ్యామిలీలో మరిన్ని హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఈ ఏడాది జనవరి 31న కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో క్లీంకారకు తోడు దొరికినట్లయింది. తమ కుమారుడికి 'శివరామ్ కొణిదెల' అని, కుమార్తెకు 'అన్వీరా దేవి కొణిదెల' అని నామకరణం కూడా చేశారు. దీంతో చరణ్ ఇద్దరు కూతుర్లతో కొడుకు తో ముగ్గురు పిల్లల తండ్రిగా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిరు, చరణ్ సినిమాలు:

కేవలం ఫ్యామిలీ పరంగానే కాకుండా సినిమాల పరంగా కూడా మెగా హీరోలకు ఈ ఏడాది అద్భుతంగా కలిసి వచ్చింది. చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వగా, తాజాగా రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో భారీ వసూళ్లతో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

నాన్నకు క్లీంకార క్యూట్ సర్ప్రైజ్:

ఇటీవల జరిగిన ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్ వేళ.. క్లీంకార తన నాన్న రామ్ చరణ్ కోసం ఇచ్చిన ఒక క్యూట్ సర్ప్రైజ్ నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. ఇంట్లో పనిచేసే సిబ్బందితో కలిసి "నాన్న.. ఐ లవ్ యూ సో మచ్" అంటూ క్లీంకార ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యాయి. ఇక కూతురి ప్రేమను చూసి చరణ్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇలా ఒకే ఏడాది ఇంట్లోకి కవల పిల్లలు రావడం, చిరంజీవి, రామ్ చరణ్‌ల సినిమాలు పెద్ద హిట్లు కావడం, ఇవన్నీ క్లీంకార తెచ్చిన అదృష్టమే అని చెప్పాలి. అందుకే ఈరోజు జూన్ 20న తన మూడో పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా ప్రిన్సెస్‌కు అటు కుటుంబ సభ్యులు, ఇటు లక్షలాది మంది మెగా అభిమానులు గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.