క్లిన్ కారా బర్త్‌డే: నెట్టింట మెగా-అల్లు ఫ్యామిలీ బాండింగ్!
ఇక ఈ పోస్ట్ కింద అభిమానులు పెడుతున్న కామెంట్లలో క్లిన్ కారాను `మెగా లిటిల్ ఏంజెల్`, `ప్రిన్సెస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ` అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
By: Sivaji Kontham | 28 Jun 2026 11:57 AM ISTమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- ఉపాసన కొణిదెల దంపతుల ముద్దుల కుమార్తె క్లిన్ కారా కొణిదెల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానులు ఈ క్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు, నెటిజన్లు ఈ లిటిల్ ప్రిన్సెస్ కి పెద్ద ఎత్తున బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ఈ బర్త్‌డే పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందన. అతడు హార్ట్ ఈమోజీని షేర్ చేసి క్లిన్ కారాపై తన ప్రేమను కురిపించాడు. ఈ క్రేజీ కామెంట్‌ను గమనించిన మెగా - అల్లు అభిమానులు సోషల్ మీడియాలో తెగ మురిసిపోతున్నారు. ఒక అభిమాని అయితే ``బ్రో.. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఇక్కడ కామెంట్ చేశాడు చూశారా`` అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మెగా లీగసీని ముందుకు తీసుకెళ్తున్న నెక్స్ట్ జనరేషన్ పిల్లల గురించి నెటిజనుల్లో సరదాగా చర్చ సాగింది.
ఇక ఈ పోస్ట్ కింద అభిమానులు పెడుతున్న కామెంట్లలో క్లిన్ కారాను `మెగా లిటిల్ ఏంజెల్`, `ప్రిన్సెస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ` అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చిన్నారి క్లిన్ కారాకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని... ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నెటిజన్లు మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. అయాన్ చేసిన ఈ చిన్న కామెంట్ వల్ల క్లిన్ కారా బర్త్‌డే పోస్ట్ మరింత వైరల్‌గా మారింది.
సమకాలీన సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ప్రపంచంలో ఎలాంటి సమీకరణాలు ఉన్నా.. కుటుంబాల పరంగా.. నెక్స్ట్ జనరేషన్ పిల్లల పరంగా మెగా-అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. రామ్ చరణ్ కుమార్తె పుట్టినరోజు వేడుకలో అల్లు అర్జున్ ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రేమను కురిపించడం మెగా ఫ్యాన్స్‌లో ఒక పాజిటివ్ వైబ్‌ని తీసుకొచ్చింది. ఈ వైరల్ మూమెంట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్హ, అయాన్‌లకు చరణ్ విషెస్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులైన అల్లు అయాన్, అల్లు అర్హలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విభిన్న సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా ఎంతో ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అయాన్ పుట్టినరోజున చెర్రీ స్పందిస్తూ ``హ్యాపీ బర్త్‌డే అయాన్.. గాడ్ బ్లెస్ యు బాయ్`` అంటూ గతంలో తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అలాగే అల్లు అర్హ బర్త్‌డే సందర్భంగా తనతో కలిసి దిగిన ఒక క్యూట్ అండ్ స్వీట్ ఫొటోను షేర్ చేస్తూ.. ఆ చిన్నారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు. మెగా - అల్లు కుటుంబాల మధ్య ఉన్న బలమైన అనుబంధానికి ఇవన్నీ నిదర్శనాలు.
