Begin typing your search above and press return to search.

రానా పొసెసివ్ నెస్ గురించి షాకింగ్ కామెంట్స్..!

రాజమౌళి సినిమా అంటే అది కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఉండాల్సిందే అనేలా క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన.

By:  Ramesh Boddu   |   28 Oct 2025 6:00 PM IST
రానా పొసెసివ్ నెస్ గురించి షాకింగ్ కామెంట్స్..!
X

రాజమౌళి సినిమా అంటే అది కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఉండాల్సిందే అనేలా క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన. సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ రాజమౌళి సినిమాకు కొత్త అందాన్ని తెస్తుంది. సై సినిమా నుంచి రాజమౌళి ప్రతి సినిమాకు సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఐతే బాహుబలి సినిమా టైం లో రాజమౌళి వర్కింగ్ స్టైల్, ప్రభాస్, రానాల గురించి కామెంట్ చేశాడు సెంథిల్ కుమార్. ముఖ్యంగా బాహుబలి ఎపిక్ రిలీజ్ టైం లో ఈ స్పెషల్ చిట్ చాట్ క్రేజీగా మారింది.

ప్రభాస్ యాంగిల్ చూస్తారు కానీ..

ఐతే ఈ ఇంటర్వ్యూలో రానా పొసెసివ్ నెస్ గురించి సెంథిల్ కుమార్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రతి సీన్ లో రానా తను కింగ్ లా భావిస్తాడు. ఫోకస్ అంతా తన మీదే ఉందని భావిస్తాడు. అనుష్క కోసం ప్రభాస్ తన కట్ చేసే సీన్ లో కూడా అక్కడ అనుష్క ఇంటెన్స్, ప్రభాస్ యాంగిల్ చూస్తారు కానీ రానా మాత్రం చూశావా సీన్ మొత్తం నేనే తినేశా అంటాడు. సినిమా పట్ల రానాకు ఉన్న పొసెసివ్ నెస్ అది.. సినిమాపై ఉన్న ఇష్టంతోనే అది ఉంటుందని అన్నారు సెంథిల్ కుమార్.

సో రానా ఉన్న సీన్స్ లో తనే బాగా కనిపించాలి అనుకోవడం మంచి విషయమే. అసలు బాహుబలి సినిమాలో భళ్లాలదేవ లేకపోతే బాహుబలి ఎంత గొప్ప వాడు అన్నది తెలిసేది కాదు. విలన్ గా చేయడానికి రానా ఎంత తర్జన భర్జన పడి ఉంటాడో తెలిసిందే. కానీ బాహుబలి అంటే ప్రభాస్ ని ఎంత బాగా గుర్తు ఉంటుందో.. రానా కూడా అంతే బాగా గుర్తుంటాడు. సినిమా మీద ఇష్టం ప్రేమ ఉన్న రానాకి పొసెసివ్ నెస్ కూడా ఉండటంలో తప్పులేదని రానా గురించి సెంథిల్ కుమార్ కామెంట్స్ పై ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు.

ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ డిఫరెంట్ అటెంప్ట్..

రానా కూడా కేవలం కమర్షియల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లొచ్చు.. కానీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ డిఫరెంట్ అటెంప్ట్ లు చేస్తూ వస్తున్నాడు. రానా ఇక ముందు కూడా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ సినిమా మీద అతనికి ఉన్న ప్రేమను మరింత చూపించేలా చేస్తాడని చెప్పొచ్చు.

రానా సినిమాల విషయంలో తీసుకుంటున్న గ్యాప్ అతని ఫ్యాన్స్ ని అప్సెట్ చేస్తున్నా కూడా రాబోతున్న సినిమాలతో మళ్లీ తన మార్క్ చాటాలని ఆడియన్స్ కోరుతున్నారు. పదేళ్ల తర్వాత బాహుబలి ఎపిక్ రిలీజ్ టైంలో కూడా రానా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్, రాజమౌళి, రానా స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.