కిష్కింధపురి బిజినెస్ సంగతేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరికొద్ది రోజుల్లో కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: M Prashanth | 3 Sept 2025 4:52 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరికొద్ది రోజుల్లో కిష్కింధపురి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రీసెంట్ గా భైరవంతో వచ్చిన ఆయన.. ఇప్పుడు కిష్కింధపురితో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. తాజాగా ట్రైలర్ వాటిని మరింతగా పెంచింది.
కౌశిక్ పగళ్లపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీని సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి అవ్వగా.. రిలీజ్ కు తొమ్మిది రోజుల ముందే ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ట్రైలర్ నూ విడుదల చేసేశారు.
ఊరికి ఉత్తరాన.. దారి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ అంటూ అదిరిపోయే ఎలివేషన్ తో మొదలైన ట్రైలర్.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ కు సూపర్ హిట్ దక్కనుందని అంతా అంచనా వేస్తున్నారు. సినిమాపై మంచి హోప్స్ కూడా పెట్టుకుంటున్నారు.
అయితే కిష్కింధపురి థియేట్రికల్ బిజినెస్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆంధ్ర హక్కులను రూ.3 కోట్లకు సేల్ చేశారని తెలుస్తోంది. నైజాం రైట్స్ ను రూ.1.5 కోట్లకు.. సీడెడ్ హక్కులను రూ.కోటికి అమ్మారని సమాచారం. అదే సమయంలో మేకర్స్ మంచి ప్లాన్ తో తక్కువ రేట్లకే సేల్ చేశారని టాక్ వినిపిస్తోంది.
నాన్ రికవరబుల్ అడ్వాన్సుల రూపంలో హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. నార్మల్ గా ఏపీ రైట్స్ ను రూ.5 కోట్లకు.. నైజాం మూడు కోట్ల రేంజ్ లో అమ్మవచ్చని అభిప్రాయపడుతున్నారు. సినిమాపై నమ్మకంతో నామినల్ రేట్స్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఏదేమైనా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రావడం పక్కా.
కాగా.. సినిమా విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె.. బెల్లంకొండతో రాక్షసుడు మూవీకి గాను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కిష్కింధపురిలో యాక్ట్ చేస్తున్నారు. రాక్షసుడుతో మంచి హిట్ అందుకున్న వారిద్దరూ.. ఇప్పుడు మళ్లీ విజయం సాధించేలా కనిపిస్తున్నారు. మరి కిష్కింధపురి మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో అంతా వేచి చూడాలి.
