Begin typing your search above and press return to search.

వారంతా అనుపమను చూసి నేర్చుకోవాలి..!

కొద్ది మంది హీరోలు తప్ప ఎక్కువ శాతం హీరోలు తమ సినిమాను తామే పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేయడానికి ముందుకు వచ్చారు.

By:  Ramesh Palla   |   4 Sept 2025 11:38 AM IST
వారంతా అనుపమను చూసి నేర్చుకోవాలి..!
X

సినిమా తెరకెక్కించడానికి ఎంత క్రియేటివిటీ ఉపయోగించాలో, దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడానికి అంతే క్రియేటివిటీని ఉపయోగించాలి, అదే సమయంలో సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను చెప్పి సినిమాను ప్రమోట్‌ చేయాల్సి ఉంది. సరైన ప్రమోషన్‌ లేని సినిమాలు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఫెయిల్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అయినా భారీ పబ్లిసిటీతో మొదటి రెండు మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సినిమాలను ప్రమోట్‌ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి సినిమాను అంచనాలకు మించి జనాలకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే సినిమా విడుదలకు రెండు మూడు వారాల పాటు హీరో, హీరోయిన్‌ ఖచ్చితంగా మీడియా ముందు ఉండాల్సిందే.

సినిమా ఈవెంట్స్‌లో హీరోయిన్స్‌..

కొద్ది మంది హీరోలు తప్ప ఎక్కువ శాతం హీరోలు తమ సినిమాను తామే పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేయడానికి ముందుకు వచ్చారు. కొందరు హీరోలు చాలా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటే కొందరు మాత్రం మొక్కుబడిగా సినిమా చేశాం కనుక ప్రమోట్‌ చేయాలి అన్నట్లుగా మీడియా ముందుకు వస్తారు. ఇక హీరోయిన్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. హీరోయిన్స్ చాలా మంది ప్రమోషన్‌ సమయంలో మొహం చాటేశారు అనే విమర్శలు ఎదుర్కొంటారు. కొందరు బాహాటంగానే తాము సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటాము అని ఒప్పందం చేసుకుంటూ ఉంటారు. నయనతార సినిమాల ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుంది. కానీ కొందరు హీరోయిన్స్‌ మాత్రం సినిమా షూటింగ్‌ పూర్తి చేసి అవతల పడటం కాకుండా సినిమా ప్రమోషన్ కూడా మా బాధ్యత అన్నట్లుగా ముందుకు వస్తారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి మూవీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండతో పాటు హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె చాలా నీరసంగా కనిపించడంతో చాలా మంది ఆమెను ప్రశ్నించారు. ఏం జరిగింది అంటూ ఆమెను వాకబు చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో తనకు జ్వరంగా ఉందని, రెండు రోజుల నుంచి విపరీతమైన బాడీ పెయిన్స్‌ అని అక్కడ ఉన్న కొద్ది మందితో చెప్పిందట. నిలబడేందుకు కూడా ఓపిక లేని పరిస్థితి ఉందని సన్నిహిత మీడియా వారితో అనుపమ చెప్పుకొచ్చింది. కిష్కింధపురి సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. అందుకే ఆమె ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కి హాజరు కావాల్సి వచ్చింది.

జ్వరంతో బాధ పడుతున్న అనుపమ పరమేశ్వరన్‌

తన సినిమా ప్రమోషన్‌లో తాను పాల్గొనక పోతే బాగుండదు కదా అని జ్వరం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమోషన్‌కి హాజరు అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌లలో చాలా మంది ప్రమోషన్‌ను ఎలా స్కిప్‌ చేయాలా అని అనుకుంటూ ఉంటారు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మినహా మరే ఫంక్షన్స్ ను అయినా చాలా మంది సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు. కానీ ముందస్తు ఒప్పందం ఉన్న కారణంగా తప్పని సరి పరిస్థితుల్లో వారు ఇంటర్వ్యూలకు, ఇలాంటి చిన్న ఈవెంట్స్ కి హాజరు అవుతూ ఉంటారు. కిష్కింధపురి సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్‌ జ్వరంతోనూ ఈవెంట్‌కు రావడంతో చాలా మంది హీరోయిన్స్‌ ఈమెను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్‌ జోరుతో అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో వచ్చే వారం విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్‌ కి మాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. విభిన్నమైన థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ చూస్తూ ఉంటే అనిపిస్తుంది.