Begin typing your search above and press return to search.

ష్యూర్ షాట్ బాక్సాఫీస్ విన్నర్ అవుతుంది..!

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇలా కౌశిక్ లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్ తో సాహు గారపాటి సినిమా చేయడం సంతోషంగా ఉంది.

By:  Ramesh Boddu   |   11 Sept 2025 10:01 AM IST
ష్యూర్ షాట్ బాక్సాఫీస్ విన్నర్ అవుతుంది..!
X

టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ కలిసి నటించిన సినిమా కిష్కిదపురి. ఈ సినిమాను షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు. కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా హర్రర్ జోనర్ లో వస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక సినిమా రిలీజ్ ముందు రోజు వరకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు మేకర్స్. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిష్కిందపురి మీద తన కాన్ ఫిడెన్స్ ఏంటో చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. కిష్కిందపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనిల్ రావిపూడి, బుచ్చి బాబు, సుస్మిత కొణిదెల కూడా అతిథులుగా వచ్చారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హార్డ్ వర్క్..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇలా కౌశిక్ లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్ తో సాహు గారపాటి సినిమా చేయడం సంతోషంగా ఉంది. సాహు గారపాటి సినిమా మీద ఎంతో ప్యాషన్ తో ఉంటారు. బెల్లంకొండ శ్రీనివాస్ హార్డ్ వర్క్ బాగా చేసాడు. కిష్కిందపురి మంచి ఫలితాన్ని ఇవ్వాలని అన్నారు. ఇదే ఈవెంట్ కి వచ్చిన బుచ్చి బాబు కూడా మాట్లాడుతూ సినిమాపై ఈ టైప్ కాన్ఫిడెన్స్ చాలా గొప్ప విషయమని అన్నారు. కిష్కిందపురి టీం లో ఈ కాన్ ఫిడెన్స్ చ్చూస్తే సంతోషంగా ఉందని అన్నారు. బెల్లంకొండ ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడతారో తెలుస్తుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని ఇందులో నటించిన కాస్ట్ అండ్ క్రూ కి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తానెప్పుడు డిఫరెంట్ జోనర్స్ పనిచేయాలని చూస్తాను. కౌశిక్ విజన్ బాగా నచ్చింది. కథ చెప్పినప్పుడే ఓకే చెప్పాను. తను చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ తీశాడు. అనుపమ మంచి స్నేహితురాలని అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్.

మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే..

ఈ సినిమా కంపల్సరీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా అని అన్నారు. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డామని అన్నారు. సాహు గారపాటి కమిట్మెంట్ బాగుందని అన్నారు. తప్పకుండా కిష్కిందపురి ష్యూర్ షాట్ సక్సెస్ అవుతుందని అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. కిష్కిందపురి మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇదేదో వర్క్ అవుట్ అయ్యేలానే ఉందనిపిస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ భైరవంతో రీసెంట్ గా వచ్చి నిరాశపరిచాడు. ఐతే కిష్కిందపురి సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమా ఈవెంట్ లో చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా సినిమా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుంది రిజల్ట్ ఏం అవుతుంది అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.