కిష్కింధపురికి దివాళీ మూవీస్ భయపడాలా?
అలా థియేటర్లలో మిరాయ్ చిత్రంతో పోటీ పడలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ, టీవీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.
By: Madhu Reddy | 10 Oct 2025 1:59 PM ISTకిష్కింధపురి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఇటీవల సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.. మంచి కథ ఓరియంటెడ్ హారర్ మూవీ.. అయినప్పటికీ అదే రోజు హీరో తేజ సజ్జ సినిమా కూడా విడుదలవ్వడంతో ఆ సినిమా టాక్ కి ఈ సినిమా తట్టుకోలేకపోయింది అనే వార్తలు వినిపించాయి. సూపర్ హీరో కాన్సెప్ట్.. పైగా ప్రమోషన్స్ చేత భారీ హైప్ తెచ్చుకున్న మిరాయ్ సినిమా.. దీనికి తోడు పెద్ద పెద్ద స్టార్స్ సపోర్ట్ ఉండటంతో.. అటు కథ పరంగా కూడా థియేటర్లలో పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. పిల్లలను మొదలుకొని పెద్దల వరకు అన్ని వర్గాల వారిని ఈ సినిమా మెప్పించింది. దీంతో కిష్కింధపురికి ఆదరణ తగ్గిపోయిందని చెప్పవచ్చు.
అలా థియేటర్లలో మిరాయ్ చిత్రంతో పోటీ పడిన ఈ మూవీ థియేటర్ లో బ్రేక్ ఈవెన్ అయ్యింది బట్ కంటెంట్ కి తగ్గ కలెక్షన్స్ కాదు ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ, టీవీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. అక్టోబర్ 17 నుంచి Z5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.. అలాగే అక్టోబర్ 19న టీవీలో కూడా జీ ఛానల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దెయ్యాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టేసింది. ఇకపోతే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి అక్టోబర్ 17 నుంచి రాబోతోందని తెలియడంతో ఆరోజు థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలలో కాస్త డిస్కషన్ మొదలైంది.
విషయంలోకి వెళ్తే.. దీపావళి సందర్భంగా.. అక్టోబర్ 17న సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి , రాశిఖన్నా కాంబినేషన్లో వస్తున్న 'తెలుసు కదా' చిత్రంతో పాటు నిహారిక ఎన్ఎమ్ , ప్రియదర్శి కాంబినేషన్లో వస్తున్న 'మిత్రమండలి' అలాగే అక్టోబర్ 18వ తేదీన కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్ ' చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు డ్యూడ్, బైసన్, థామా సినిమాలు కూడా ఇదే దీపావళికి థియేటర్లలో విడుదల అవడానికి సిద్ధం అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో.. ఈ సినిమాల టాక్ ఎలా ఉందో తెలియదు కాబట్టి ఆల్రెడీ హిట్ టాక్ సొంతం చేసుకున్న కిష్కింధపురి ఓటీటీలోకి రాబోతోందని తెలిసి సినీ లవర్స్ ఎక్కువగా ఈ సినిమా పైనే ఆసక్తి కనబరుస్తున్నారు.
మంచి కథ ఓరియంటెడ్ తో వచ్చిన ఈ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. పైగా టీవీ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో అసలే గత నెల నుంచి వరుస హిట్ చిత్రాలకి టికెట్స్ కొని చూస్తున్న వేళ.. మరొక సరి టికెట్టుకొని కథ ఏంటో తెలియని సినిమాకు వెళ్తారా? లేక ఆల్రెడీ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్న కిష్కింధపురి మూవీని ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చూస్తారా? అంటే కచ్చితంగా కిష్కిందపురికి ఓటేస్తారు.
ఏది ఏమైనా అటు థియేటర్లలో కలెక్షన్లు సాధించలేకపోయిన ఈ సినిమా ఈసారి ఓటీటీ లో కచ్చితంగా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందని సినీ లవర్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పైగా అప్పుడు మిరాయ్ మూవీ నుంచి తప్పించుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రాబోయే చిత్రాలు కి చిన్నపాటి ఇబ్బంది తప్పదు అని తెలుస్తుంది.
