బెల్లంకొండ 'కిష్కింధపురి'.. తొలి వారంలో ఎన్ని కోట్లంటే?
అయితే తాజాగా మేకర్స్ కీలక విషయాన్ని అనౌన్స్ చేశారు. తొలి వారంలో సినిమా రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని తెలిపారు.
By: M Prashanth | 19 Sept 2025 10:26 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శాండీ మాస్టర్ తదితరులు నటించారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన కిష్కింధపురి మూవీ.. సెప్టెంబర్ 12వ తేదీన విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సూపర్ మౌత్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది. థియేటర్స్ లో చూడాలని అంతా ఫిక్స్ అయ్యి తరలివెళ్తున్నారు.
తద్వారా సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న కిష్కింధపురి.. సెకెండ్ వీక్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా మేకర్స్ కీలక విషయాన్ని అనౌన్స్ చేశారు. తొలి వారంలో సినిమా రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్.. హై ఆక్టేన్ మోడ్ లో కనిపించి మెప్పించారు. పోస్టర్ అదిరిపోయిందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. మస్ట్ వాచబుల్ మూవీ అంటూ కిష్కింధపురిని కొనియాడుతున్నారు.
అయితే సినిమా నిలకడ వసూళ్లతో రాణిస్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ.. రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ.. అలా మరింత బజ్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మొదటి మూడు రోజులు రెట్టింపు కలెక్షన్లు సాధించి అదరగొట్టింది. అలా ఇప్పటివరకు ఏడు రోజులకు గాను రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
కాగా, కిష్కింధపురి మూవీకి ప్రమోషన్ తో కలుపుకుని మొత్తం తక్కువే బడ్జెట్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుమారు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా రిలీజ్ అయిందని సమాచారం. చాలా చోట్ల ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని వినికిడి. ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా రూ.22 కోట్లు రాబట్టిందని తెలిపారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో సినిమా టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలవనుంది.
