Begin typing your search above and press return to search.

కిష్కింధపురి.. అందరికీ లాభదాయకమే..

తెలుగు రాష్ట్రాల్లో 66 ప్రీమియర్స్ షో వేయగా.. సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది కిష్కింధపురి. ఆ తర్వాత రెండో రోజు.. తొలి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించి అలరించింది.

By:  M Prashanth   |   15 Sept 2025 5:52 PM IST
కిష్కింధపురి.. అందరికీ లాభదాయకమే..
X

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కిష్కింధపురి. సూపర్ హిట్ సినిమా రాక్షసుడు తర్వాత మరోసారి జంటగా నటించిన ఆ చిత్రానికి చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. హారర్ జోనర్ లో సినిమాను రూపొందించారు.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఆ సినిమాలో తనికెళ్ల భరణి, హైపర్‌ ఆది, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శాండీ మాస్టర్‌, మర్కంద్‌ దేశ్‌ పాండే, హినా భాటియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చైతన భరద్వాజ్‌ సంగీతం అందించిన ఆ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లే మూవీ కూడా అలరిస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పిస్తోంది. తద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 66 ప్రీమియర్స్ షో వేయగా.. సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది కిష్కింధపురి. ఆ తర్వాత రెండో రోజు.. తొలి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించి అలరించింది. ఇప్పుడు సెకెండ్ డే కన్నా మూడో రోజు మరిన్ని వసూళ్లు సాధించింది. ఓపెనింగ్స్ కన్నా మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువ కావడం గమనార్హం.

అలా కిష్కింధపురి మూవీ ఇంప్రూవ్ అయింది. అయితే నిర్మాత సాహు గారపాటి.. సినిమాను అడ్వాన్స్ బేసిస్ లో విడుదల చేసి రూ.8 కోట్ల వరకు రాబట్టారు. నాన్- థియేట్రికల్ డీల్ సాలిడ్ గా జరిగినట్లు ఇప్పటికే సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు తెలుస్తోంది.

దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించిందని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సోమవారం నుంచి సినిమా లాభాలు తెస్తుందని సమాచారం. మొత్తానికి నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సహా అందరికీ కిష్కింధపురి సేఫ్ జోన్ లోకి వచ్చి.. లాభదాయకమైన ప్రాజెక్ట్ గా నిలిచిందని వినికిడి.