Begin typing your search above and press return to search.

కిష్కిందపురి 'ఉండిపోవే నాతోనే'.. బెల్లంకొండ అనుపమ మెలోడీ ట్రాక్

By:  M Prashanth   |   7 Aug 2025 6:12 PM IST
కిష్కిందపురి ఉండిపోవే నాతోనే.. బెల్లంకొండ అనుపమ మెలోడీ ట్రాక్
X

మొదటి సినిమా నుంచి ఊహించిన ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ఫోకస్ అవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మంచి క్రేజ్ అందుకుంటున్న ఈ యువ హీరో ఈ మధ్య మరింత ప్రయోగాత్మకమైన కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ 'కిష్కిందపురి' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేకెత్తించింది. శ్రీనివాస్ మ్యాజికల్ పెర్ఫామెన్స్‌తో పాటు, విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’ విడుదలైంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, జావేద్ అలీ గానంలో వచ్చిన ఈ బీచ్ మెలడీ పాట ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ మూడ్‌తో మెలోడీయస్‌గా సాగిపోతూనే, సాఫ్ట్ బీట్స్‌తో ఆహ్లాదపరుస్తోంది. పాటలోని లిరిక్స్, ట్యూన్, పిక్చరైజేషన్ అన్నీ కలిసొచ్చి పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోగా, అనుపమ పరమేశ్వరన్ మరింత గ్లామర్‌గా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్‌పై నిండుగా కనిపించింది. బీచ్ లొకేషన్స్‌లో, క్యూట్ గా కనబడే జంటని చూస్తుంటే మనమే ఆ క్షణాల్లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇక డ్యాన్స్ మూవ్స్ కూడా ఈ పాటకు స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఈ పాటతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తన విజన్‌ను ఇప్పటికే గ్లింప్స్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు నిర్మాత సహూ గరపాటి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఉండిపోవే నాతోనే’ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెలోడీ మాజిక్‌తో పాటు లీడ్స్ కెమిస్ట్రీ, బీచ్ విజువల్స్ ఇవన్నీ కలసి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. పాటతో పాటుగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఈ మెలడీకి మంచి స్పందన వస్తోంది. మొత్తానికి ‘కిష్కిందాపురి’ మూవీపై ఈ పాట మరోసారి హైప్ పెంచేసింది.