Begin typing your search above and press return to search.

చీరకట్టులో హాట్ డోస్ పెంచిన కీర్తి కుల్హారి!

ఎల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పలు రంగులు కలయికలో ఉన్న సారీ కట్టుకొని ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది..

By:  Madhu Reddy   |   26 Sept 2025 7:00 PM IST
చీరకట్టులో హాట్ డోస్ పెంచిన కీర్తి కుల్హారి!
X

భాషతో సంబంధం లేకుండా ఈమధ్య సెలబ్రిటీలు అన్ని భాషలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు సినిమాలలోనే కాదు ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే మరుగున పడ్డ హీరోయిన్స్ కూడా సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలుగా మారుతూ తమ పాపులారిటీని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా అవకాశాలు కూడా అందుకుంటూ ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోతున్నారు..ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఈమె ఎవరో కాదు బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి. ఈమె అంటే సౌత్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు, సినిమాల ద్వారా ఫేమస్ నటిగా గుర్తింపు పొందింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చీర కట్టుకొని అద్భుతమైన లుక్ తో సోషల్ మీడియా అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో పలు రంగులు కలయికలో ఉన్న సారీ కట్టుకొని ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది..

ఈ ఫోటోలలో ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా జీవితంలో కఠిన శ్రమ, గొప్ప ప్రేమ అనేది చాలా అరుదు అంటూ క్యాప్షన్ పెట్టింది.అలాగే తన కొత్త మూవీ ఫుల్ ప్లేట్ కూడా అలాంటిదే అని, అందులో నటించినందుకు గర్వపడుతున్నాను అంటూ రాసుకు వచ్చింది. ప్రస్తుతం కీర్తి కుల్హరి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అందర్నీ ఆకర్షిస్తుంది.

40 ఏళ్ల కీర్తి కుల్హారి వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బాలీవుడ్లో దూసుకుపోతోంది. అలా ఖిచ్డి:ది అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి కుల్హరి ఆ తర్వాత సైతాన్, సూపర్ సే ఊపర్, పింక్, బ్లాక్ మెయిల్, ఖిచ్డి2: మిషన్ పాంతుకిస్థాన్, హిసాబ్ బరాబర్ వంటి సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సౌత్ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మడి అందానికి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయేమో చూడాలి.

ఇక కీర్తి కుల్హారి నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే ఫుల్ ప్లేట్, బాదాస్ రవి కుమార్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇక కీర్తి కుల్హారి పర్సనల్ లైఫ్ కి వస్తే.. సాహిల్ సెహగల్ ని 2016లో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 2021లో అతని నుండి విడిపోయింది.