Begin typing your search above and press return to search.

ఫామ్ హౌస్ ఆఫర్ వెనుక ట్విస్ట్.. అసలు నిజం బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసిన ఆ వ్యక్తి "ఎందుకు రాలేదు?" అని ప్రశ్నించాడట.

By:  Madhu Reddy   |   11 May 2026 9:00 PM IST
ఫామ్ హౌస్ ఆఫర్ వెనుక ట్విస్ట్.. అసలు నిజం బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ
X

యూట్యూబ్‌లో '7 ఆర్ట్స్' వీడియోలతో పాపులర్ అయి, బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకున్న కిర్రాక్ సీత తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఆమె ధైర్యంగా బయటపెట్టింది. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ఫామ్ హౌస్‌కు పిలిచిన వ్యక్తి, ఆ తర్వాత ఇచ్చిన భారీ ఆఫర్ వెనుక ఉన్న అసలు రంగును సీత బయటపెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆ వివరాలు చూద్దాం..

యూట్యూబ్ నుంచి బిగ్‌బాస్ వరకు:

సరయూతో కలిసి చేసే బోల్డ్ వీడియోల ద్వారా సీత సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడమే కాకుండా, బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో దాదాపు 40 రోజుల పాటు ఉండి అందరినీ మెప్పించింది. ఇక ప్రస్తుతం అటు టీవీ షోలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని తన పాత జ్ఞాపకాలను పంచుకుంది.

అవకాశం పేరుతో ఫామ్ హౌస్ పిలుపు:

ఇక ఆమె మాట్లాడుతూ .'నాకు ఒక వ్యక్తి నుండి కాల్ వచ్చింది సినిమాలో మంచి ఆఫర్ ఉందని చెప్పాడు,ఆ టైం లో నాకు 21 ఏళ్ళు , ఎవరైనా సరే సినిమా ఛాన్స్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నేను కూడా అలాగే అనుకున్న అయితే ఆఫీసులో కలవమంటే.. మొత్తం టీమ్ అంతా ఫామ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడికే రావాలని సదరు వ్యక్తి చెప్పాడు. ఇక ఏదో తేడాగా ఉందని నేను ఆ కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఆ రోజు వెళ్లలేదు.అదే మంచిదయ్యింది' అని ఆమె తెలిపింది.

రూ. 25 లక్షల ఆఫర్.. సీత రియాక్షన్:

రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసిన ఆ వ్యక్తి "ఎందుకు రాలేదు?" అని ప్రశ్నించాడట. తనకు రావడం ఇష్టం లేదని సీత చెప్పగా.. "మీకు 25 లక్షలు ఇస్తారట" అంటూ ఆశ చూపించాడట. ఆ మాట వినగానే అది ఆఫర్ కాదు, మరేదో అని అర్థం చేసుకున్న సీత వెంటనే 'నో' చెప్పేసింది. పారితోషకం కంటే తన వ్యక్తిత్వమే ముఖ్యమని భావించి ఆ మాయ మాటలను తిప్పికొట్టింది.

ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలాగే ఉంటాయా?:

మెసేజ్‌లు, కాల్స్ ద్వారా నెంబర్లు సంపాదించి సీరీస్ తీస్తున్నాం, ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా అంటూ ఇండైరెక్ట్ గా మాట్లాడే వారు చాలా మంది ఉంటారని సీత ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కొందరు ఇండస్ట్రీకి సంబంధం లేని వారు కూడా సరదా కోసం కాల్స్ చేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారని, అలాంటి వారికి తాను తనదైన స్టైల్లో బుద్ధి చెప్తానని సీత స్పష్టం చేసింది.

సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే యువతులకు సీత చెప్పిన విషయాలు ఒక హెచ్చరిక లాంటివి. ఎదురుగా కనిపిస్తున్నది ఆఫరా లేక మాయావలయా అని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆమె పరోక్షంగా సూచించింది. ఏది ఏమైనా, ఇలాంటి చేదు అనుభవాలను ధైర్యంగా బయటకు చెప్పి మరో నలుగురికి అవగాహన కలిగిస్తున్న కిర్రాక్ సీతను అభినందించాల్సిందే..