Begin typing your search above and press return to search.

కిరీటి నెక్స్ట్ ఏంటి? బాలయ్య డైరెక్టర్ తోనేనా?

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి రీసెంట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నటించిన తొలి చిత్రం జూనియర్ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

By:  M Prashanth   |   23 Feb 2026 10:00 PM IST
కిరీటి నెక్స్ట్ ఏంటి? బాలయ్య డైరెక్టర్ తోనేనా?
X

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి రీసెంట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నటించిన తొలి చిత్రం జూనియర్ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, జెనీలియా డిసౌజా కీలక పాత్రలో కనిపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌ గా రూపొందిన ఆ మూవీ.. కిరీటి మంచి ఆరంభాన్ని ఇచ్చిందనే అభిప్రాయాలు వినిపించాయి.

జూనియర్ మూవీ కథ పరంగా చూస్తే ఓ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ.. కమర్షియల్ అంశాలు ఫుల్ గా ఉన్నాయి. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్‌ లో కిరీటి మంచి ఎనర్జీ చూపించారు. డెబ్యూ హీరో అయినప్పటికీ కాన్ఫిడెన్స్‌ తో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాంగ్స్, యాక్షన్ సీన్స్ యూత్‌ కు బాగా నచ్చాయి. పెద్ద అంచనాలు లేకుండా సినిమా చూస్తే నచ్చుతుందన్న టాక్ వచ్చింది.

ఇక జూనియర్ మూవీ తర్వాత కిరీటి తదుపరి ప్రాజెక్ట్‌ పై ఆసక్తి పెరిగింది. రెండో సినిమాకే స్టార్ డైరెక్టర్‌ తో పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీనును ఇటీవల కిరీటి కలిసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ బాధ్యతలన్నీ తమవేనని, అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు టాక్.

మాస్, యాక్షన్, లార్జర్ దన్ లైఫ్ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడిగా బోయపాటికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఆయన తీసిన అఖండ 2 సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ను అందుకోలేకపోయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో బాలయ్య– బోయపాటి కాంబినేషన్‌ లో మొదటిసారి ప్లాప్ రావడం చర్చనీయాంశమైంది.

అయినా కూడా బోయపాటి మార్కెట్ మాత్రం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది. పలువురు నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నప్పటికీ, తదుపరి ప్రాజెక్ట్‌ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కిరీటి–బోయపాటి భేటీ అయినట్లు వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

యంగ్ హీరోతో మాస్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. కిరీటి ఇమేజ్‌ కు సరిపోయేలా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బాలీవుడ్ లో బోయపాటి ఓ మూవీ చేస్తారని, ఆ తర్వాత కిరీటి తో సినిమా తీస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఆ కాంబినేషన్ నిజమవుతుందా? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వెళ్తుంది? అన్నది వేచి చూడాలి.