టాలీవుడ్ యంగ్ హీరోల్లో బిజీయెస్ట్ హీరో అతనే!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ యూత్ హీరోల్లో క్రేజీ స్టార్ గా ఎదుగుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Sept 2025 1:24 PM ISTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ యూత్ హీరోల్లో క్రేజీ స్టార్ గా ఎదుగుతున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారిపోయారు. క సినిమాతో సొంత బ్యానర్ లో సూపర్ హిట్ ను అందుకున్న కిరణ్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న హీరో అయిపోయారు.
8 క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన కిరణ్
క సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన కిరణ్, ఈ ఇయర్ ఆల్రెడీ దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం కిరణ్ చెన్నై లవ్‌స్టోరీ చేస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఆడియన్స్ లో సినిమాపై హైప్ ను పెంచింది.
కిరణ్ స్పీడుకు షాక్ అవ్వాల్సిందే
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలుండటంతో ఈ యంగ్ హీరో స్పీడు చూసి అందరూ షాకవుతున్నారు. 8 సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా అవన్నీ క్రేజీ ప్రాజెక్టులే కావడం విశేషం. ఒకేసారి పలు సినిమాలు చేస్తూ, కొత్త కొత్త కథలతో ముందుకెళ్తున్న కిరణ్ కెరీర్ గ్రాఫ్ రోజురోజుకీ భారీగా పెరుగుతుంది. జైన్స్ నాని దర్శకత్వంలో కె ర్యాంప్ మూవీ చేస్తున్న కిరణ్, చెన్నై లవ్ స్టోరీ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బాలీవుడ్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సుకుమార్ అసోసియేట్ రంగ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు కిరణ్. తాజాగా మిర్జాఫూర్ ఫేమ్ ఆనంద్ అయ్యర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ కావడంతో ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమాలన్నీ కిరణ్ అబ్బవరం ఇమేజ్ ను ఏ లెవెల్ కు తీసుకెళ్తాయో చూడాలి.
