కిరణ్ అబ్బవరం.. ఒకే ఒక్కడు!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 6 Oct 2025 4:02 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ సినిమాలతో ఆకట్టుకున్న ఆయన.. గత ఏడాది క మూవీతో ఒక్కసారిగా యమా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కే ర్యాంప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ కానుకగా థియేటర్స్ లో ఆ సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీస్ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్టోరీ విన్నారని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
సుకుమార్ రైటింగ్స్ తో ఓ మూవీ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలా అనేక సినిమాలను కిరణ్ లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు తన లైనప్ లో ఉన్న సూపర్ హిట్ మూవీ క సీక్వెల్ ను త్వరలో మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ ను కిరణ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
అదే సమయంలో అటు హీరోగా ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం.. ఇటు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించాలని చూస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కేఏ ప్రొడక్షన్ బ్యానర్ పై వివిధ చిత్రాలు రూపొందించేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారని వినికిడి. ఆ విషయంలో ఇప్పటికే కిరణ్ స్పెషల్ ప్లాన్ లో ఉన్నారట.
మరికొద్ది రోజుల్లో నిర్మాతగా మూడు సినిమాలు అనౌన్స్ చేయాలనే యోచనలో కిరణ్ అబ్బవరం ఉన్నారని తెలుస్తోంది. అందుకు మంచి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని సమాచారం. ఆ మూడు చిత్రాలకు సంబంధించి ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జరుగుతోందని టాక్. దాదాపు చాలా వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేశారని వినికిడ.
మూడు సినిమాలకు టైటిల్స్ ఫిక్స్ చేశారని సమాచారం. ఉగాది రోజు, దీపావళి రోజు, రిలీజ్ రోజు అనే పేర్లను కన్ఫర్మ్ చేశారట. వాటి స్టోరీలకు లింక్ ఉంటుందని.. తద్వారా ట్రయాలజీని కిరణ్ మొదలుపెట్టనున్నారని సమాచారం.. ఆ సినిమాల ద్వారా కొత్త దర్శకుడు.. టాలీవుడ్ కు పరిచయమవ్వన్నారని టాక్. మొత్తానికి హీరోగా.. నిర్మాతగా బోలెడు సినిమాలతో బిజీగా ఉంది టాలీవుడ్ లో బహుశా కిరణ్ ఒక్కరే ఏమో.
