Begin typing your search above and press return to search.

హీరో మెటీరియల్ వివాదంపై కిరణ్.. కౌంటర్ ఇచ్చాడుగా!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. మరికొద్ది రోజుల్లో కె- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   11 Oct 2025 10:01 PM IST
హీరో మెటీరియల్ వివాదంపై కిరణ్.. కౌంటర్ ఇచ్చాడుగా!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. మరికొద్ది రోజుల్లో కె- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ట్రైలర్ విడుదల చేశారు.

అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత మీడియాతో మాట్లాడారు కిరణ్ అబ్బవరం. ఆ సమయంలో ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అప్పుడు కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సంబంధించిన వివాదం ప్రస్తావనకు రావడంతో సదరు జర్నలిస్ట్ కు కిరణ్ అబ్బవరం కౌంటర్ ఇవ్వగా.. ఆ వీడియో వైరల్ గా మారింది.

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయనను ఉద్దేశించి ఒక ఫిమేల్ జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మీరు హీరో మెటీరియల్ కాదంటూ ఆ మీడియా ప్రతినిధి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారగా.. అంతా వాటిని ఖండించారు. ఇప్పుడు ఆ విషయంపై కిరణ్ స్పందించారు.

'హీరోగా మీరు చాలా కష్టపడి వచ్చారు. ఇటీవల ప్రెస్ మీట్ లో ప్రదీప్ రంగనాథన్ ను క్వశ్చన్ చేశా. హీరోగా కష్టపడి వచ్చారు. కష్టాన్ని చెప్పాలనుకున్నారు. కానీ డీ గ్రేడ్ చేయాలనుకోలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగాలంటే మామూలు విషయం కాదు' అని అడగ్గా.. నన్ను అడగండి అమ్మ పర్లేదంటూ కిరణ్ చెప్పారు.

పక్క స్టేట్ నుంచి వచ్చిన వారిని అలా కించపరచొద్దు అంటూ కౌంటర్ వేశారు. 'మీరు మేము ఒకటే. ఒక మాట అన్న పడతాను.. నాకు ఏది చెప్పినా వింటాను. కానీ పక్క స్టేట్ హీరో మన దగ్గరకు వచ్చినట్లు నీ లుక్స్ ఇలా ఉన్నాయేంటి అని కించపరచడం బాధగా ఉంది. నా ఉద్దేశ్యం ఏంటంటే పక్క రాష్ట్రానికి హీరో వస్తే రిస్పెక్ట్ ఇవ్వాలి' అని అన్నారు.

కిరణ్ అబ్బవరం అలా అనడంతో.. తాను అడిగిన క్వశ్చన్ పూర్తిగా తెలుసుకోలేదు అంటూ మాట్లాడారు. కొంతమంది మీడియా వాళ్లు కూడా నేను అడిగిన ప్రశ్నను కట్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఆ జర్నలిస్ట్ అన్నారు. ఏదేమైనా ప్రదీప్ రంగనాథన్ విషయంలో కిరణ్ అబ్బవరం మద్దతుగా నిలబడ్డారు. ప్రెస్ మీట్ లో కౌంటర్ కూడా ఇచ్చారు.