Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో 'క'కు నో థియేటర్స్.. అబ్బవరం మరోసారి ఇలా..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో కచ్చితంగా ఉండే కిరణ్ అబ్బవరం.. గత ఏడాది క మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 Oct 2025 5:54 PM IST
కోలీవుడ్ లో కకు నో థియేటర్స్.. అబ్బవరం మరోసారి ఇలా..
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో కచ్చితంగా ఉండే కిరణ్ అబ్బవరం.. గత ఏడాది క మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాతో ఒక్కసారిగా తన రూట్ ను మార్చారు. వరుస చిత్రాలు లైన్ లో పెట్టారు. అనేక సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా కూడా గడుపుతున్నారు.

అయితే క మూవీ ప్రమోషన్స్ లో తమిళనాడులో తన సినిమాకు థియేటర్స్ ఇవ్వలేదని అప్పుడు చెప్పిన సంగతి విదితమే. తమిళనాడులో అసలు తెలుగు షోలు వేయడానికి స్క్రీన్లు ఇవ్వలేదని తెలిపారు. వాళ్లు ఎలాంటి మొహమాటం లేకుండా మన హీరోలకు థియేటర్లు ఇవ్వలేదని అన్నారు. కానీ తెలుగులో కోలీవుడ్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి.

విడుదలవ్వడమే కాదు.. పెద్ద సంఖ్యలో థియేటర్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు ఆ విషయంపై మరోసారి మాట్లాడారు కిరణ్ అబ్బవరం. ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ రంగనాథన్ లాంటి తమిళ నటుడికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతున్నాయని ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఆయన నటించిన సినిమాలకు ఫుల్ గా దొరుకుతున్నాయని అన్నారు.

కానీ తాను నటించిన సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయాలంటే మాత్రం థియేటర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది తనకు బాగా తెలుసని అన్నారు. ఎందుకంటే తాను క సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు, వాళ్ళు వేరే హీరోస్ కు థియేటర్స్ లేవని ఓపెన్ గా చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

దీంతో పలువురు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన చెప్పింది నిజం లాగా అనిపిస్తుందని అంటున్నారు. దీనిపై టాలీవుడ్ పెద్దలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. తెలుగు వాళ్ళు అన్ని భాషల హీరోలను ఆదరిస్తున్నారని, కానీ మన హీరోలకు అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

అయితే కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు కే- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. జైన్స్ నాని తెరకెక్కించిన ఆ సినిమాను రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.